
సూర్య (Suriya) కెరీర్ పై ర్మాత మైత్రీ రవి జోస్యం చెప్పేశారు. రాజకీయాల్లో గ్యాప్ ను సీఎం విజయ్ భర్తీ చేశారని, ఇప్పుడు కోలీవుడ్ లో నంబర్ వన్ స్థానాన్ని సూర్య భర్తీ చేయడం ఖాయం అంటూ జాతకం చెప్పేశారు నిర్మాత మైత్రీ రవి. ఈయన ఇంకో కొత్త సెంటిమెంట్ కనిబెట్టారు. “విశ్వనాధ్ అండ్ సన్స్” (Vishwanath and Son) సినిమాకు ఆ సెంటిమెంట్ ను జోడించారు. “మమిత బైజు సినిమాలో ఏడ్చిందంటే మనం కూడా ఏడ్చేస్తాం. ఆ అమ్మాయి సినిమాలో ఏడ్చిందంటే, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయినట్టే. ఈ సినిమాలో మమితతో పాటు మా హీరో సూర్య కూడా ఏడ్చారు. కాబట్టి ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఎమోషనల్ రైడ్ కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది” ఇంతకుముందు ‘మైత్రీ’లో ‘డూడ్’ అనే సినిమా చేసింది మమిత (Mamitha Baiju). అందులో ఆమె ఏడ్చిందంట. ఆమె ఏడ్చింది కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్టయిందని, “విశ్వనాధ్ అండ్ సన్స్” లో కూడా మమిత ఏడ్చింది కాబట్టి, కచ్చితంగా హిట్ అయి తీరుకుందని అంటున్నారు మైత్రీ రవి
.