
‘సురభి ఏక్ ఎహసాస్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా, హాంగ్‌కాంగ్‌లో 27వ కార్గిల్ విజయ్ దివస్‌ను తెలుగు గ్లోబల్ వెబ్ రేడియో అయిన తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్కు (టోరీ) చెందిన రేడియో జాకీ జయ పీసపాటి ఘనంగా నిర్వహించారు. ‘సురభి ఏక్ ఎహసాస్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా, హాంగ్‌కాంగ్‌లో తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్లో (టోరీ) రేడియో జాకీ జయ పీసపాటి 27వ కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఆమె 2012 నుంచి భారత సాయుధ దళాలకు అంకితం చేస్తూ ‘జై హింద్’ అనే టాక్ షోను నిర్వహిస్తున్నారు. ఈ షోలో కార్గిల్ యుద్ధ వీరులు, వీరనారీమణులు, సాయుధ దళాల కుటుంబాలకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలు (NGOలు) పాల్గొంటున్నాయి. ఈ సంవత్సరం కూడా హాంగ్‌కాంగ్‌లోని ప్రవాస భారతీయులు దేశ భక్తి, అభిమానంతో దేశ రక్షకులైన సైనికుల కోసం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లతో సహా పిల్లలు, పెద్దలు అందరూ అదే ఉత్సాహంతో, స్ఫూర్తితో దేశభక్తి ఉప్పొంగేలా గీతాలు పాటలు, నృత్యాలను ప్రదర్శించారు. గతనెల 26న జరగాల్సిన ఈ కార్యక్రమం, ఊహించని విధంగా కేటగిరీ 8 (T8) తుఫాను రావడంతో ఆగస్టుకు వాయిదా పడింది. భారత-నేపాలీ యుద్ధ స్మారక చిహ్నానికి ఆనుకొని ఉన్న హ్యాపీ వ్యాలీలోని హిందూ దేవాలయంలోని మోహన్ హాల్లో భారత కాన్సులేట్ జనరల్, హిందూ సంఘం వారి గొప్ప సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాంకాంగ్, మకావులలోని భారత గౌరవనీయ కాన్సుల్ జనరల్ రాజేష్ ఎన్ నాయక్‌తో పాటు కాన్సుల్స్ మిస్ సుర్భి గోయల్, కాన్సుల్ కె. వెంకట్ రమణ శ్రీ మేఘనాథ్ మధుకర్ గావిత్, హిందూ సంఘం అధ్యక్షుడు లాల్ హర్దాసాని, హాంకాంగ్, చైనాలోని భారతీయ జనతా పార్టీ (బీజీపీ) ఓవర్సీస్ ప్రెసిడెంట్ సోహన్ గోయెంకా, హిందూ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు నిర్మల్ లాంగని, పూజ్ బ్రహ్మ