
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలో విద్యార్థుల నిరసనల సమయంలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులపై వారు దాష్టీకం చేశారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. పంజాబ్- హరియాణా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. విద్యార్థి ఉద్యమకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు, మహిళలపై హింస, బాధితులకు వైద్య సహాయం, నష్టపరిహారం అందించడం వంటివి ఈ కమిటీ పరిశీలించనుంది. పోలీసు సిబ్బందిపై హింస, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అధికారులు లేవనెత్తిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. ‘‘బాధ్యులెవరినీ వదిలిపెట్టం. విషయాన్ని తీవ్రంగా పరిగణించి కొలిక్కి తీసుకొస్తాం. అందుకే ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తున్నాం. జులై 20న చలో పార్లమెంటు సమయంలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల రికార్డులను కమిటీకి అప్పగించాలని ఆదేశిస్తాం’’ అని ఇటీవల సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది