© 2026 nimisham.in

దేశవ్యాప్తంగా పోర్నోగ్రఫీ నియంత్రణకు ప్రత్యేక జాతీయ విధానం రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ, జులై 13 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పోర్నోగ్రఫీ నియంత్రణకు ప్రత్యేక జాతీయ విధానం రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు కొట్టివేసింది. మైనర్లను అశ్లీల కంటెంట్ ప్రభావం నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాతీయ పాలసీని తీసుకురావాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అశ్లీల కంటెంట్ నియంత్రణ, దానికి సంబంధించిన విధానాల రూపకల్పన వంటి అంశాలు కోర్టుల పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహా విధాన నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా ప్రభుత్వం, పార్లమెంట్, చట్టసభల అధికార పరిధిలోని అంశాలని ధర్మాసనం పేర్కొంది. ప్రజాప్రయోజన అంశాలపై కోర్టులు అవసరమైన సందర్భాల్లో జోక్యం చేసుకోగలిగినప్పటికీ, కొత్త విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం న్యాయవ్యవస్థ బాధ్యత కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విధాన నిర్ణయాల విషయంలో కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల అధికారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అశ్లీల వెబ్సైట్లు, ఆన్లైన్ పోర్నోగ్రఫీ కారణంగా చిన్నారులు ప్రభావితమవుతున్నారని పేర్కొంటూ దేశవ్యాప్తంగా సమగ్ర జాతీయ విధానం తీసుకురావాలని పిటిషన్లో కోరారు. అయితే అలాంటి విధానాలను రూపొందించడం, అమలు చేయడం ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది. దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
Read Latest AP News And Telangana News And National News