© 2026 nimisham.in

సూర్య ప్రకాష్ జోశ్యుల సుబ్బు (సందీప్ కిషన్) అలియాస్ సుబ్రహ్మణ్యం సగటు మిడిల్ క్లాస్ కుర్రాడు. తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) రికమండేషన్‌తో ఓ టెంపరరీ జాబ్ సంపాదిస్తాడు. అది ఓ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్. ఇక సుబ్బు తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) రిటైర్డ్ హెడ్మాస్టర్. కానీ రిటైర్ అయింది ఉద్యోగమే గానీ, కొడుకును తిట్టే డ్యూటీ నుంచి కాదు. కొడుకును చూసిన ప్రతిసారీ ఆయనకు "ఇంకా ఏదైనా తిట్టడం మిగిలిపోయిందేమో" అనే అనుమానం వస్తుంటుంది. ఇక విధి చాలా క్రూరమైన మేధావి. డీఈఓ గారి తనిఖీలో సుబ్బు చేసిన ఒక చిన్న, అమాయకపు సాంకేతిక పొరపాటు అతని టెంపరరీ కుర్చీని లాగేసింది. ఇప్పుడు తండ్రి 'తిట్ల దండకం' తట్టుకోవాలంటే ఒకటే దారి: డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆఫర్ చేసిన 'సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్' ఉద్యోగం. లొకేషన్: మాకీపూర్. అప్పటికే సుబ్బుకు దివ్య (మానస చౌదరి) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్సవుతుంది. జాబ్ పర్మినెంట్ అయితేనే పెళ్లి సజావుగా జరిపిస్తానని సుబ్బు తండ్రి కండీషన్ పెడతాడు. దాంతో వేరే దారిలేక ఇష్టం లేకపోయినా మాకీ పూర్ బయిలుదేరతాడు. ఇక మాకీపూర్ ఒక వింతైన హ్యూమన్ ల్యాబొరేటరీ. అక్కడి ప్రజలు దేశంలోనే అత్యధిక 'సంతానోత్పత్తి రేటు' (Fertility Rate) సాధించి రికార్డు సృష్టించారు. కానీ విచిత్రం ఏంటంటే—అక్కడ 'శృంగారం' లేదా 'సెక్స్' అనే పదాన్ని ఉచ్చరించడం దేశద్రోహం కంటే పెద్ద నేరం. అంటే, ప్రొడక్షన్ విపరీతంగా జరుగుతోంది, కానీ ప్రాసెస్ గురించి మాట్లాడటానికి వీల్లేదు! అలాంటి చిత్రమైన పరిస్దితుల్లో సుబ్బుకు 'స్వాతి' (మిథిలా పాల్కర్)పరిచయమైంది. స్వాతి ఆ ఊరి అమ్మాయి. కాస్త ఉషారైన అమ్మాయి. సుబ్బుని అర్దం చజేసుకునే అమ్మాయి. ఆమె తోడుగా సుబ్బుఏం చేసాడు..గ్రామస్థుల మూఢ నమ్మకాలు మధ్య సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలను సుబ్బు ఎలా చెప్పాడు? తండ్రికి తన ఉద్యోగం తెలియకుండా ఎలా మేనేజ్ చేసాడు? మాకీపూర్
--- సూర్య ప్రకాష్ జోశ్యుల సుబ్బు (సందీప్ కిషన్) అలియాస్ సుబ్రహ్మణ్యం సగటు మిడిల్ క్లాస్ కుర్రాడు. తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) రికమండేషన్‌తో ఓ టెంపరరీ జాబ్ సంపాదిస్తాడు. అది ఓ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్. ఇక సుబ్బు తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) రిటైర్డ్ హెడ్మాస్టర్. కానీ రిటైర్ అయింది ఉద్యోగమే గానీ, కొడుకును తిట్టే డ్యూటీ నుంచి కాదు. కొడుకును చూసిన ప్రతిసారీ ఆయనకు "ఇంకా ఏదైనా తిట్టడం మిగిలిపోయిందేమో" అనే అనుమానం వస్తుంటుంది. ఇక విధి చాలా క్రూరమైన మేధావి. డీఈఓ గారి తనిఖీలో సుబ్బు చేసిన ఒక చిన్న, అమాయకపు సాంకేతిక పొరపాటు అతని టెంపరరీ కుర్చీని లాగేసింది. ఇప్పుడు తండ్రి 'తిట్ల దండకం' తట్టుకోవాలంటే ఒకటే దారి: డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆఫర్ చేసిన 'సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్' ఉద్యోగం. లొకేషన్: మాకీపూర్. అప్పటికే సుబ్బుకు దివ్య (మానస చౌదరి) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్సవుతుంది. జాబ్ పర్మినెంట్ అయితేనే పెళ్లి సజావుగా జరిపిస్తానని సుబ్బు తండ్రి కండీషన్ పెడతాడు. దాంతో వేరే దారిలేక ఇష్టం లేకపోయినా మాకీ పూర్ బయిలుదేరతాడు. ఇక మాకీపూర్ ఒక వింతైన హ్యూమన్ ల్యాబొరేటరీ. అక్కడి ప్రజలు దేశంలోనే అత్యధిక 'సంతానోత్పత్తి రేటు' (Fertility Rate) సాధించి రికార్డు సృష్టించారు. కానీ విచిత్రం ఏంటంటే—అక్కడ 'శృంగారం' లేదా 'సెక్స్' అనే పదాన్ని ఉచ్చరించడం దేశద్రోహం కంటే పెద్ద నేరం. అంటే, ప్రొడక్షన్ విపరీతంగా జరుగుతోంది, కానీ ప్రాసెస్ గురించి మాట్లాడటానికి వీల్లేదు! అలాంటి చిత్రమైన పరిస్దితుల్లో సుబ్బుకు 'స్వాతి' (మిథిలా పాల్కర్)పరిచయమైంది. స్వాతి ఆ ఊరి అమ్మాయి. కాస్త ఉషారైన అమ్మాయి. సుబ్బుని అర్దం చజేసుకునే అమ్మాయి. ఆమె తోడుగా సుబ్బుఏం చేసాడు..గ్రామస్థుల మూఢ నమ్మకాలు మధ్య సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలను సుబ్బు ఎలా చెప్పాడు? తండ్రికి తన ఉద్యోగం తెలియకుండా ఎలా మేనేజ్ చేసాడు? మాకీపూర్ ప్రజల్లో సుబ్బు మార్పు తీసుకురాగలిగాడా? సెక్స్ ఎడ్యుకేషన్‌పై ఉన్న అపోహలను తొలగించగలిగాడా? అనేది తెలియాలంటే సీరిస్ పూర్తిగా చూడాల్సిందే. విశ్లేషణ: "సెక్స్ గురించి మాట్లాడొద్దు..." ఇదే మన సమాజం పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పే మొదటి పాఠం. విచిత్రం ఏంటంటే... పెద్దయ్యాక అదే పిల్లలు తల్లిదండ్రులు అవుతారు. కానీ ఆ పాఠం మాత్రం మారదు. 'సూపర్ సుబ్బు' ఈ మౌనాన్నే తన కథకు కేంద్ర సంఘర్షణగా ఎంచుకుంది. ఈ సిరీస్‌ను చూస్తే ఇది సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అనిపిస్తుంది. కానీ స్క్రీన్‌ప్లేను గమనిస్తే... ఇది సెక్స్ ఎడ్యుకేషన్ కథ కాదు. సెక్స్ గురించి మాట్లాడలేకపోయే సమాజం కథ. ఈ రెండింటి మధ్య తేడానే సిరీస్‌కు బలంగా కూడా మారింది... అదే సమయంలో బలహీనతగా కూడా మారింది. స్క్రిప్ట్ ఎక్కడ గెలిచింది? సాధారణంగా ప్రతి గొప్ప సోషల్ కామెడీలో ఒక రూల్ ఉంటుంది. సమస్య బయట ఉండదు... హీరో ఇంట్లోనే ఉంటుంది. Vicky Donor → కుటుంబం. PK → నమ్మకాలు. Panchayat → సిస్టమ్. సూపర్ సుబ్బు → ఇంట్లోని మౌనం. రైటర్స్ మొదటి రెండు ఎపిసోడ్లలోనే అసలు సమస్యను స్పష్టంగా చెప్పేశారు. సుబ్బు పెరిగిన కుటుంబం, తండ్రి ఆలోచనా విధానం, అమ్మాయితో సహజంగా మాట్లాడలేని అతని ఇబ్బంది... ఇవన్నీ కలిసి అతను గ్రామానికి వెళ్లకముందే అతని సమస్యను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చేస్తాయి. ఇది మంచి స్క్రీన్‌ప్లే లక్షణం. హీరో వెళ్లి ప్రపంచాన్ని మార్చాలంటే... ముందుగా అతనిలోనే అదే సమస్య ఉండాలి. సుబ్బు విషయంలో అదే జరుగుతుంది. మొదటి ఎపిసోడ్లో తండ్రి టీవీలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా చూడలేక ఛానెల్ మార్చేయడం చిన్న సీన్లా కనిపించినా... అదే మొత్తం సిరీస్ థీమ్‌ను చెప్పేస్తుంది. ఒక డైలాగ్‌తో కాదు... ఒక పరిస్థితితో థీమ్‌ను చెప్పడం స్క్రీన్‌ప్లేలో బలమైన రచన. "దర్శకుడు భయపడ్డాడు" మొదటి రెండు ఎపిసోడ్లు చూస్తే దర్శకుడు చాలా ధైర్యంగా కనిపిస్తాడు. మూడో ఎపిసోడ్ నుంచి మాత్రం సేఫ్ గేమ్ మొదలవుతుంది. ఎందుకంటే ఎక్కడా ...సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ లోతుగా వెళ్లలేకపోయాడు. అందుకు బదులుగా విలేజ్ కామెడీ పెంచాడు. మాకీపూర్కు వెళ్లిన తర్వాత కథ దాదాపు పూర్తిగా గ్రామ జీవితం, అక్కడి మనుషులు, వాళ్లతో సుబ్బు పడే ఇబ్బందులు, గ్రామంలోని చిన్న చిన్న సంఘటనల చుట్టూనే తిరుగుతుంది. అంటే... సబ్జెక్ట్ బ్యాక్‌డ్రాప్‌గా మిగిలిపోతుంది. కథ మాత్రం గ్రామ కామెడీగా మారిపోతుంది. ఇదే ఈ సిరీస్‌లో పెద్ద లోపం. కామెడీ పనిచేసిందా? దర్శకుడు బూతు కామెడీ వైపు వెళ్లకపోవడం మంచి నిర్ణయం. డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా... అవి ఎక్కువగా పదాలతోనే ఆడతాయి. కంప్యూటర్, పెన్‌డ్రైవ్ లాంటి పదాలతో నవ్వించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల అది పనిచేస్తుంది. మరికొన్ని చోట్ల బలవంతంగా పెట్టిన పంచ్లా అనిపిస్తుంది. అసలు ఈ కథలో నవ్వు రావాల్సింది పరిస్థితుల వల్ల. కానీ చాలా చోట్ల పాత్రల అతిశయోక్తి ప్రవర్తనే కామెడీకి ఆధారం అవుతుంది. దాంతో నవ్వు సహజంగా కాకుండా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేలో బెస్ట్ సీన్ ఏది? ఈ సిరీస్‌లో గుర్తుండిపోయే సీన్ ఏదైనా ఉందంటే... మగపిల్లలు ఎలా పుడతారు అని గ్రామ మహిళలు అడిగే సన్నివేశం. సుబ్బు వారికి X, Y క్రోమోజోమ్స్ అని సైన్స్ క్లాస్ తీసుకోడు. రెండు పూల కుండీలను తీసుకుని, "మట్టి ఒకటే... కానీ విత్తనం ఏదైతే వేస్తామో అదే మొలుస్తుంది. మరి మట్టిని ఎందుకు నిందిస్తారు?" అని చెబుతాడు. అక్కడ రచయిత ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఎడ్యుకేషన్ అంటే సమాచారం ఇవ్వడం కాదు... ఎదుటివాడికి అర్థమయ్యే భాషలో చెప్పడం. ఇదే సిరీస్‌లోని అత్యుత్తమ రచన. శానిటరీ ప్యాడ్స్ గురించి చెప్పే సన్నివేశం కూడా ఇదే కోవలో పడుతుంది. "అందరికీ జన్మస్థానమైన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గెందుకు?" అనే డైలాగ్ సందేశంలా కాకుండా సందర్భంలోనే వస్తుంది. అయితే ఇలాంటి మంచి సన్నివేశాలు మొత్తం ఏడు ఎపిసోడ్లలో చాలా తక్కువ. మొదటి రెండు ఎపిసోడ్లలో దర్శకుడు లేవనెత్తిన ప్రశ్నలకు... తర్వాతి ఐదు ఎపిసోడ్లు అంత బలమైన సమాధానాలు ఇవ్వవు. పాత్రలే పెద్ద సమస్య సుబ్బు పాత్ర మినహా మిగతా పాత్రలు ఒక్క కోణంలోనే కనిపిస్తాయి. గ్రామస్థులు అంటే అందరూ ఒకేలా ప్రవర్తించడం... మగవాళ్లు అంటే అందరూ ఒకే ఆలోచనలో ఉండటం... పాత్రలకు సహజత్వం కంటే క్యారికేచర్ ఎక్కువ కావడం... దాంతో వాళ్లతో భావోద్వేగంగా కనెక్ట్ కాలేం. నవ్వు వస్తుంది. కానీ మనసుకు తగలదు. క్లైమాక్స్ ఎందుకు వర్కవుట్ కాలేదు? ఈ కథ మొదటి నుంచి తండ్రి-కొడుకు సంబంధంతో మొదలవుతుంది. అందుకే ప్రేక్షకుడు చివర్లో ఎదురు చూసేది... గ్రామం మారిందా? కాదు. తండ్రి మారాడా? కానీ స్క్రీన్‌ప్లే ఆ ఎమోషన్ ని పూర్తిగా ఉపయోగించుకోలేదు. తండ్రి తన పాత ఆలోచనలను వదిలి కొడుకును కొత్త కోణంలో అర్థం చేసుకునే ప్రయాణాన్ని చూపించి ఉంటే... క్లైమాక్స్‌కు మరింత బలం వచ్చేదేమో. ఎందుకు పాత కథలా అనిపిస్తుంది? కథలో ఉన్న సమస్య కొత్తది. కానీ దాన్ని చెప్పే విధానం పాతది. "హీరో గ్రామానికి వెళ్లడం... గ్రామస్థులు వ్యతిరేకించడం... ఒక్కొక్కరుగా మారడం... చివర్లో హీరోని అంగీకరించడం...". ఈ డిజైన్ మనం చాలా కథల్లో చూసిందే. అందుకే కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ఉన్నా... కథనం కొత్త అనుభూతిని ఇవ్వదు. ఒక ప్రశ్న ఈ కథను గ్రామంలో కాకుండా... హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్లో పెట్టి ఉంటే ఇంకా బాగా వర్కవుట్ అయ్యేదా? ఫైనల్ థాట్: ఇలాంటి సామాజిక అంశాలపై తీసే కథలు ప్రేక్షకుడిని మెప్పించాలంటే సందేశం కంటే మనుషులు గుర్తుండాలి. ఉదాహరణకు Panchayat వంటి సిరీస్‌ల్లో గ్రామం బ్యాక్‌డ్రాప్ మాత్రమే. అసలు బలం అక్కడి పాత్రలు. వాళ్ల బలహీనతలు, చిన్న చిన్న కోరికలు, సంబంధాలు ప్రేక్షకుడిని నవ్విస్తూనే కదిలిస్తాయి. అలాగే Vicky Donorలో సబ్జెక్ట్ ఎంత బోల్డ్ అయినా... సినిమా పని చేసింది పాత్రల నిజాయితీ వల్ల, సంబంధాల వల్ల. సందేశం చివరికి వచ్చింది. ముందు కథ వచ్చింది. 'సూపర్ సుబ్బు'లో మాత్రం కొన్ని చోట్ల కథ ఆగి... సందేశం ముందుకు వచ్చిన భావన కలుగుతుంది. ఇంకొంచెం జాగ్రత్తపడితే బాగుండేదనిపిస్తుంది. చూడచ్చా? ఎక్కువ ఆలోచించకుండా...సరదాగా చూసుకుంటూ పోతే...బాగుందనిపిస్తుంది. అక్కడక్కడా నవ్విస్తుంది కాబట్టి ఛల్తాహై, అయితే ఫ్యామిలీలతో కలిసి చూసేటప్పుడు కొంచెం ఇబ్బందే. ఎక్కడ చూడచ్చు? నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది మొత్తం 4 Hours (7 Episodes)