
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ప్రసిద్ధ బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి ఆమె 'ఎన్సెంబల్ ఎక్సలెన్స్ అవార్డు'కు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు బెర్క్లీ నిర్వహించే 'ఆస్పైర్: ఫైవ్-వీక్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఇంటెన్సివ్' ప్రోగ్రామ్‌కు సుకుమార్ కూతురు సుకృతి వేణికి పూర్తి ట్యూషన్ స్కాలర్షిప్ కూడా లభించింది. సంగీత ప్రపంచంలో ఎంతో కీలకమైన ఈ వేదికపై తెలుగు అమ్మాయి అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుకృతి వేణి చిన్ననాటి నుంచే సంగీతంపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తూ క్లాసికల్ నుంచి మోడరన్ శైలుల వరకు తీవ్రంగా సాధన చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా బెర్క్లీ సమ్మర్ ప్రోగ్రామ్‌లలో క్రమం తప్పకుండా పాల్గొంటూ వోకల్, మ్యూజిక్ థియరీ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసింది. ఇటీవలే సౌత్ కొరియాలో నిర్వహించిన ఒక అంతర్జాతీయ కాన్సర్‌లో సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన సింగర్‌గా పాల్గొని ఇంగ్లీష్ పాటలతో హాలీవుడ్ స్థాయిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా జరిగిన కఠినమైన పోటీని తట్టుకుని ఆమె ఈ ఉన్నతమైన అవకాశాన్ని దక్కించుకోగలిగింది. ఈ సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి 272 మంది అత్యుత్తమ విద్యార్థులు ఆడిషన్లో పాల్గొనగా, వారిలో కేవలం 14 మంది మాత్రమే ఈ పూర్తి స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. దీంతో సింగర్స్ విభాగంలో ఈ అరుదైన ప్రతిష్టాత్మక గౌరవాన్ని సాధించిన ఏకైక విద్యార్థినిగా సుకుమార్ కూతురు సుకృతి వేణి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉండగా, బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అందించే ఈ ఎన్సెంబల్ ఎక్సలెన్స్ అవార్డు సదరు ప్రోగ్రామ్‌లోనే అత్యున్నత స్థాయి ట్యూషన్ స్కాలర్‌షిప్‌గా నిలుస్తుంది. గ్లోబల్ లెవల్లో తెలుగు ప్రతిభను చాటిచెప్పిన ఈ విజయంపై సోషల్