© 2026 nimisham.in

సూజీ మంచూరియా.. తయారీకి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ (సూజీ)- కప్పు, పెరుగు - రెండు స్పూన్లు, అల్లం ముక్కలు - స్పూను, వెల్లుల్లి ముక్కలు - స్పూను, మిరియాలు - కొన్ని. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ (సూజీ)- కప్పు, పెరుగు - రెండు స్పూన్లు, అల్లం ముక్కలు - స్పూను, వెల్లుల్లి ముక్కలు - స్పూను, మిరియాలు - కొన్ని, పచ్చి మిర్చి - స్పూను, క్యాబేజీ ముక్కలు - అర కప్పు, క్యారెట్ తురుము - అర కప్పు, క్యాప్సికమ్ ముక్కలు - రెండు కప్పులు, ఉల్లి ముక్కలు - కప్పు, చిల్లీ సాస్ - స్పూను, టమాటా కెచప్ - స్పూన్, సోయా సాస్, పుదీనా, కొత్తిమీర - కాస్త. తయారుచేసే విధానం: ఓ వెడల్పాటి గిన్నెలో సూజీ, పెరుగు, ఉప్పు, మిరియాల పొడితో పాటు అన్ని కూరగాయలు(క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లి మినహా), పెరుగు వేసి, అవ సరమైతే కాస్త నీళ్లు కలిపి చిన్న ముద్దలుగా చేసిపెట్టుకోవాలి. ఈ ముద్దలను పది నిమి షాల పాటు ఎయిర్ ఫ్రై లేదా బేక్ చేయాలి. ఓ వెడల్పాటి బాణలిలో కాస్త నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చిలను వేయించాలి. క్యాబేజీ, క్యారెట్ తురుము, ఉల్లి ముక్కల్నీ చేర్చాలి. రెండు నిమిషాల తరవాత సోయా సాస్, వెనిగర్, చిల్లి సాస్, టమాటా కెచప్ వేసి అంతా కలపాలి. కాస్త నీళ్లనీ చేర్చి రెండునిమిషాలు మంచూరియా ముద్దలూ కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పైన కొత్తిమీర, పుదీనా తరుగును చల్లితే సరి. బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి.. Read Latest AP News And Telangana News And International News And Telugu Newsఆరోగ్య చింతామణి