
తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న మండాడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ప్రమాదకర అనుభవాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమిళనాడు తీర ప్రాంతంలో జరిగే సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సముద్రంలోనే 45 రోజులపాటు క్లైమాక్స్ చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం సముద్రంలోకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్లమని, ఈ ప్రాజెక్ట్ కోసం తాను దాదాపు 100 రోజులు కేటాయించానని ఆయన చెప్పారు. సముద్రంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో పడవలు తిరగబడటం వంటి ప్రమాదాలు పలుమార్లు జరిగాయని, నాలుగైదు సార్లు ఇక అయిపోయాం అనుకునే స్థాయికి వెళ్లామని సుహాస్ వివరించారు. తన కెరీర్లోనే ఇది అత్యంత ప్రమాదకరమైన అనుభవమని, ఇకపై ఇలాంటి లైఫ్ రిస్క్ ఉన్న సినిమాలు చేయనని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడు మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ సుమారు రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వెట్రిమారన్ వ్యవహరిస్తుండగా, సముద్రం పైన నైపుణ్యంతో నావికులను నడిపించే నాయకుడి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో హీరోగా సూరి ముత్తుకాళి పాత్రలో నటిస్తుండగా, సుహాస్ విలన్ షేడ్స్ ఉన్న సత్తపులి పాత్రలో నటిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్ జై శంకర్, బాల సరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. సముద్రంలో నిజమైన అలలు, గాలి దిశ ఆధారంగా పడవను నడపడం అత్యంత కష్టమైన ప్రక్రియ కావడం వల్ల చిత్రీకరణ సమయంలో యూనిట్‌కు తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2025 అక్టోబర్ 3న రామనాథపురం జిల్లా తొండి తీరంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక సిబ్బంది ఉన్న పడవ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగింది. ఇదిలా