
Success Story: ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికి బదులుగా సొంత వ్యాపారం ప్రారంభించాలని లేదా సొంతంగా పని చేసుకోవాలని కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాకు చెంది రైతు మధుసూదన్ ధాకడ్ స్టోరీ కూడా అలాంటి వారికి స్ఫూర్తిదాయకం. రైతు మధుసూదన్ కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభించి ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.ప్రధాని మోదీ లేటెస్ట్ ఇన్ స్టా వీడియో: దేశ ప్రజలకు పిలుపుమధుసూదన్ రైతు కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచే వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉన్నాడు. మొదట్లో ఆయన సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేశాడు. కానీ ఆశించినంత ఆదాయం రాలేదు. అనంతం ఆయన తన వ్యవసాయ పద్ధతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు . వ్యవసాయం, నర్సరీల ద్వారా ఆయన ఏటా సుమారు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు.మధుసూదన్ ధాకడ్ గోధుమ వంటి సాంప్రదాయ పంటలకు బదులుగా వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, క్యాప్సికమ్, టమాటాలు, అల్లం వంటి అధిక విలువ గల పంటలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఆధునిక పద్ధతుల సహాయంతో ఆయన క్రమంగా తన వ్యవసాయాన్ని విస్తరించి నేడు సుమారు 200 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు.వ్యవసాయంతో పాటు నర్సరీ ప్రారంభం మధుసూదన్ కేవలం పంటలు పండించడానికే పరిమితం కాలేదు. ఆయన తన సొంత నర్సరీని కూడా ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. వ్యవసాయం, నర్సరీ ద్వారా ఆయన వార్షిక ఆదాయం సుమారు రూ.5 కోట్లకు చేరుకుంది. సరైన పంటను ఎంచుకోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం, మంచి యాజమాన్యం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చని ఆయన విజయం నిరూపిస్తుంది.ఏ పంట నుంచి ఎంత ఆదాయం వస్తుంది?*మధుసూదన్ 40 ఎకరాల భూమిలో పచ్చి మిరపకాయలు సాగు చేశాడు. దీనికి ఆయనకు ఎకరానికి సుమారు 70,000 రూపాయలు ఖర్చయింది. ఆయనకు ఎకరానికి సుమారు