
ప్రపంచ ఆర్థిక సవాళ్ల నడుమ భారత ఆర్థిక వ్యవస్థ 7.8% జీడీపీ (GDP)వృద్ధితో దూసుకుపోతోందన్న వార్తలు దేశవ్యాప్తంగా గొప్ప ఆశాభావాన్ని నింపాయి.అయితే,పైకి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ గణాంకాల వెనుక ఉన్న అసలు ఆర్థిక చిత్రాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.కేవలం హెడ్లైన్ సంఖ్యలను చూసి సంబరపడకుండా,గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చారు.బేస్ ఇయర్ సవరణల మాయాజాలం:గార్గ్ విశ్లేషణ ప్రకారం,గత ఏడాది జీడీపీ అంచనాలను సవరించి 6.9%కి గణనీయంగా తగ్గించారు.ముఖ్యంగా ప్రస్తుత ధరల వద్ద గతేడాది తొలి త్రైమాసికం (Q1) జీడీపీ రూ.86 ట్రిలియన్లుగా అంచనా వేయగా,దానిని సవరించి రూ.80 ట్రిలియన్లకు కుదించారు.ఈ విధంగా గత ఏడాది ఆధారిత సంఖ్య తగ్గడం వల్ల,ఈ ఏడాది వృద్ధి రేటు గణాంకాలు స్వయంచాలకంగా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.ఈ స్థాయిలో భారీ సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయన బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తయారీ రంగం మందగమనం - వినియోగంలో క్షీణత:ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం,గనుల రంగాలు మెరుగ్గా రాణించినప్పటికీ,ప్రభుత్వ మునుపటి డేటాతో పోలిస్తే తయారీ రంగం బలహీనంగా ఉందన్నారు.ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయం నిజమైనదేనని,అది 15% పైగా పెరిగిందని అంగీకరించినప్పటికీ..ఆయన ప్రధాన ఆందోళన మాత్రం సాధారణ ప్రజల వినియోగంపైనే ఉంది.ప్రభుత్వ పాత అంచనాలతో పోల్చి చూస్తే ప్రస్తుత వినియోగ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.నో డబుల్ స్టాండర్డ్స్: ప్రధాని మోదీ ఇన్ డైరెక్ట్ వార్నింగ్- పాకిస్తాన్ పీఎం ఎదురుగానేఆర్థిక వ్యవస్థ అసలైన బలానికి సాధారణ ప్రజల కొనుగోలు శక్తే ప్రాతిపదిక.కేవలం కాగితాలపై అంకెలను అందంగా చూపిస్తూ లోపలి బలహీనతలను దాచిపెట్టడం వల్ల నష్టం జరుగుతుంది.ఇప్పటికైనా పాలకులు హెడ్లైన్ నంబర్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా,గ్రౌండ్ లెవెల్లో వినియోగం తగ్గడానికి గల కారణాలను గుర్తించాలి.