
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నా.. సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ కథలకు మాత్రం ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా, నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుంది 'స్టీఫెన్' అనే సినిమా. ఈ సినిమా కథను 2021లో కేరళలో జరిగిన ఒక దారుణమైన క్రైమ్ స్టోరీ ఆధారంగా రాసుకున్నారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకమైన అమ్మాయిలను టార్గెట్ చేసిన స్టీఫెన్ జబరాజ్ అనే సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుస హత్యలు, వాటి వెనుక ఉన్న మిస్టరీలు, హంతకుడి ప్లాన్స్, పోలీసుల ఇన్వెస్టిగేషన్.. ఇలా సినిమా మొదలైనప్పటి నుంచి ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుంది
.