
దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla).. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. వేగవంతమైన స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు, పొట్టచెక్కలయ్యే కామెడీ ట్రాక్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ఘనత ఆయన సొంతం. ‘ఆనందం’తో మొదలైన ఆయన విజయ ప్రస్థానం.. ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్షా’ లాంటి సినిమాలతో సాగింది. ఒకప్పుడు ఆయన సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్లలో నవ్వుల పండగే అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయేవారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో చేసిన సరికొత్త ప్రయోగాలు, బ్రహ్మానందం లాంటి హాస్య నటులకు రాసిన విలక్షణ పాత్రలు వెండితెరపై నవ్వుల పూలు పూయించాయి. తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక సరికొత్త ఫార్ములాను సెట్ చేసిన ఘనత ఆయనది. అయితే కాలక్రమంలో ఒకే తరహా ఫార్ములా రొటీన్ అవ్వడం, కథల్లో కొత్తదనం తగ్గడంతో ఆయనకు కొన్ని వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అయినా సరే.. తన మార్క్ వినోదంతో పాటు నేటి ట్రెండ్‌కు తగ్గ కథనంతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా అదిరిపోయే రీ-ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు శ్రీను వైట్ల. సరైన కథ కుదిరితే ఆయన కలం, కెమెరా ఎంతటి మ్యాజిక్ చేస్తాయో ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. ఈ క్రమంలోనే టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)తో సరికొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం అత్యంత గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర అత్యంత భారీ