
ఆమదాలవలస గ్రామీణం: అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలస పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో కొత్తగా మంజూరైన 50 స్పౌస్, రోల్‌బ్యాక్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఆధారంలేని కుటుంబాలకు పెన్షన్లు ఆర్థికంగా భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.