
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్ వర్షార్పణమైంది. ప్రస్తుతం వర్షం ఆగింది. అయితే, మైదానాన్ని సిద్ధం చేసేందుకు సమయం పట్టనుంది. దీంతో 12 గంటలకు ఉండాల్సిన లంచ్ బ్రేక్‌ను 11.40 గంటలకే ఇచ్చారు. మైదానం సిద్ధమైతే రెండో సెషన్ ఆట 12.20 గంటలకు మొదలుకానుంది. గాలె వేదికగా శ్రీలంక - భారత్ (IND vs SL) తొలి టెస్టు మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా మారాడు. దీంతో రెండో రోజు ఆట ఇంకా మొదలే కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వర్షం ఆగకపోవడంతో మైదానమంతా కవర్లతో కప్పి ఉంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్ఇండియా స్కోరు 288/2. క్రీజ్‌లో దేవదత్ పడిక్కల్ (131*), రిషభ్ పంత్ (27*) ఉన్నారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (32), శుభ్‌మన్ గిల్ (16) పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ (77*) రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లాడు. తొలి రోజు కూడా వర్షం కారణంగా 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ హవా సాగింది