
ఇంటర్నెట్ డెస్క్: యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతం చేశాడు. తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసి అబ్బురపరిచాడు. ఎనిమిదో ఓవర్‌ను వేస్తోన్న అతడు మొదటి బంతికే చండిమాల్ (4)ను పెవిలియన్‌కు చేర్చాడు. అద్భుతంగా టర్న్ అయిన బంతి చండిమాల్ గ్లౌవ్‌ను తాకుతూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతిలో పడింది. దీంతో 27 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్‌ను నష్టపోయింది. తొలి ఓవర్లోనే వికెట్‌ను కోల్పోయిన శ్రీలంక ఆ షాక్ నుంచి కాస్త తేరుకుంది. బ్యాటర్లు ఉదారా (18*), చండిమాల్ (4*) మరో వికెట్ పడనీయకుండా ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 27/1. అంతకుముందు టీమ్ఇండియా 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. శ్రీలంక - భారత్ (IND vs SL) జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమ్ఇండియా 462 పరుగులకు ఆలౌటైంది. చివరి వికెట్‌గా ప్రసిద్ధ్ కృష్ణ (2) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ మదుష్క (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. రెండో బంతికే స్లిప్‌లో ఉన్న పడిక్కల్‌కు మదుష్క క్యాచ్ ఇచ్చాడు. గత రెండు రోజులు వర్షం కారణంగా దాదాపు 60 ఓవర్ల వరకూ ఆట రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ ఓ పావుగంట ముందుగానే మ్యాచ్ మొదలైంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర