
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో మొదటి టెస్టులో భారత్ 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ (32: 37 బంతుల్లో 5 ఫోర్లు) రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. కేశర నువాంత బౌలింగ్‌లో (10.6వ ఓవర్) కేఎల్ రాహుల్ ఆడిన బంతి నాన్‌స్ట్రైకర్ వైపు వెళ్లింది. అయితే, బంతిని ఆపేందుకు ప్రయత్నించిన నువారా యశస్విని తగిలాడు. దీంతో యశస్వి పట్టు తప్పి కిందపడ్డాడు. మరోవైపు కేఎల్ రాహుల్ (14*) సింగిల్ కోసం ఇటు వైపు వచ్చాడు. కానీ, యశస్వి స్ట్రైకింగ్‌కు వెళ్లలేకపోయాడు. దీంతో ఫీల్డర్ ప్రభాత్ జయసూర్య విసిరిన బంతిని తీసుకుని కీపర్ డిక్వెల్లా వికెట్లను పడగొట్టాడు. దీంతో నిరాశగా యశస్వి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. ప్రస్తుతం టీమ్ఇండియా స్కోరు 12 ఓవర్లకు 47/1. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి సెషన్లో ఆచితూచి ఆడుతోంది. పిచ్ నుంచి పేసర్లకు కాస్త సహకారం లభిస్తుండటంతో షాట్లు కొట్టేందుకు టీమ్ఇండియా ఓపెనర్లు సాహసం చేయడంలేదు. యశస్వి జైస్వాల్ (18*) మాత్రం వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతున్నాడు. కేఎల్ రాహుల్ (6*) కూడా ఒక ఫోర్ రాబట్టాడు. ఎడాపెడా షాట్లు కాకుండా నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 7 ఓవర్లకు 25/0. శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ (India vs Srilanka) టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కలేదు. భారత్ ముగ్గురు ఎడమచేతివాటం స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతోంది. టీమ్ఇండియా టెస్టు చరిత్రలో ఇది 600వ మ్యాచ్. ఈ మార్క్‌ను అందుకొన్న మూడో టీమ్‌గా భారత్ నిలిచింది. ఇంగ్లాండ్ (1083), ఆస్ట్రేలియా (883) ముందున్నాయి. మరోవైపు గాలె వేదికగా ఇది 50వ టెస్టు కావడం గమనార్హం. భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్