
IND vs SL : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు గాలే ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. ఈ టెస్టు సిరీస్‌లోని తొలి టెస్టు కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ధనంజయ డిసిల్వా నాయకత్వంలో లంక జట్టు బరిలోకి దిగనుంది. కమిందు మెండిస్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో నిరోషన్ డిక్వెల్లాను జట్టులోకి తీసుకున్నారు. డిక్వెల్లా చివరిసారిగా 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తరఫున ఈ ఫార్మాట్లో ఆడాడు. ఇటీవల మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న పాతుమ్ నిస్సాంక పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. IND vs AFG : బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. కన్ఫాం చేసిన బీసీసీఐ.. ఎప్పటి నుంచంటే? ఇక దేశీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న పసిందు సూరియబండార తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు ఆఫ్-స్పిన్నర్ కేశర నువంత కూడా చోటు దక్కించుకున్నాడు. 2023లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ఏకైక టెస్టు ఆడిన ఎడమచేతి వాటం పేసర్ దిల్షాన్ మధుశంకను కూడా జట్టులోకి తిరిగి పిలిచారు. అతని పునరాగమనం శ్రీలంక పేస్ బౌలింగ్ విభాగానికి మరింత పటిష్టతను, వైవిధ్యాన్ని చేకూరుస్తుంది. శ్రీలంక ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్ గెలిచింది. భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో, శ్రీలంక కంటే ఒక స్థానం పైన ఉంది. ఆ జట్టు తొమ్మిది టెస్టులు ఆడి