
సీతానగరం: పర్యావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ-గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్ నాగబాబు (Nagababu) తెలిపారు. అడవులను రక్షించడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్తమన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అక్కడ ఉన్న కుంకీ ఏనుగులకు ఆహారం అందించి, వాటి పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి.
వినాయక చవితి (Ganesh Chaturthi) వేళ తూర్పుగోదావరి జిల్లా కడియంలోని మురుగన్‌ నర్సరీలో వినూత్నంగా వృక్ష గణపతిని తయారు చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Rains) తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు బస్టాండ్ జలమయమైంది.






