
మహానటుడు ఎన్టీఆర్ తో నటించిన మొదటి హీరోయిన్ షావుకారు జానకి (Sowcar Janaki). అప్పటి తరం నుంచి మొన్నటి ‘అంతా మన మంచికే’ చిత్రం వరకు నటించిన అత్యంత సీనియర్ నటి ఆమె. బహుశా 75 ఏళ్లకి పైగా కెరీర్ ఉన్న నటి ఆమె ఒక్కరే కావొచ్చు అని నందమూరి బాలకృష్ణ అన్నారు. బాలయ్య, చిరంజీవి, ఎన్టీఆర్…ఇంకా పలువురు సెలెబ్రెటీలు షావుకారు జానకికి నివాళులు అర్పించారు. ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. “షావుకారు జానకిగారితో మా అనుబంధం ప్రత్యేకం – నందమూరి బాలకృష్ణ మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆమె ‘షావుకారు జానకి’గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’లో కీలక పాత్ర ధరించారు. ‘పాండురంగ మహాత్మ్యం’ నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను ‘తాతమ్మకల’లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత