© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Emotional Family Video: కన్నవారి కలలను నెరవేర్చడంలో ఉండే ఆనందం అంతో, ఇంతో కాదు.. పేదరికంలో పుట్టినా.. పట్టుదలతో శ్రమించి పైకొచ్చి.. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూస్తే.. ఆ తృప్తి ముందు కోట్ల రూపాయలు కూడా పనికారవు.. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఒక యువకుడు తన తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించి.. వారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభూతిని బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో ఇప్పుడు లక్షలాది నెటిజన్ల హృదయాలను గెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఖేము సైనీ అనే యువకుడు ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఒకప్పుడు కుటుంబ తినడానికి చాలా కష్టం అయ్యేది.. నెలకు కేవలం 6 నుంచి 7 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ.. తీవ్రంగా కష్టపడేవాడు.. ఆ సమయంలో పూట గడవడమే ఎంతో కష్టంగా ఉండేది.. అలాంటి పరిస్థితుల్లో విమానం ఎక్కడం అనేది ఆ కుటుంబానికి కలలో కూడా ఊహించని విషయంగానే భావించవచ్చు.. కానీ.. ఖేము తన పేదరికాన్ని చూసి అస్సలు కుంగిపోలేదట.. తన కష్టాన్ని నమ్ముకుని పగలు రాత్రి చాలా వరకు కష్టపడ్డాడు.. ఎంతో శ్రమతో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత.. తన తల్లిదండ్రులకు, అక్కకు విమాన ప్రయాణం చేయించాలనే తన చిరకాల కోరికను నెరవేర్చాడు. ఖేము సైనీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా (@tijara_vines01) ద్వారా
ఈ అద్భుతమైన వీడియోను పోస్ట్ చేశాడు.. ఈ వీడియోలో, అతని కుటుంబం రాజస్థానీ సంప్రదాయ దుస్తులైన ధోతీ-కుర్తా ధరించి.. ఎంతో సంతోషంగా విమానాశ్రయానికి రావడం ఈ వీడియోలో మనం చూడోచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పటి.. నుంచి విమానంలో కూర్చునే వరకు ఆ తల్లిదండ్రుల ముఖంలో కనిపించిన ఆనందం.. కళ్లలో మెరిసిన ఆ బ్రైట్నెస్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత వారు పొందిన సంతోషం చూసి ప్రతి ఒక్కరూ ఎంతగానో భావోద్వేగానికి గురయిన్నట్లు తెలుస్తోంది..
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్‌గా మారింది... నిజమైన విజయం అంటే ఇదే.. మన సంపాదనతో కన్నవారి ముఖంలో చిరునవ్వులు పూయించడానికి మించిన ఆస్తి మరొకటి లేదు.. అంటూ నెటిజన్లు ఖేము సైనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు విమానం గురించి ఆలోచించడానికే భయపడే స్థాయి నుంచి.. ఈ రోజు అదే విమానంలో సగర్వంగా ప్రయాణించిన ఈ కుటుంబం కథ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.