
ఒకప్పుడు లగ్జరీ హోటళ్లు, జపాన్ లాంటి దేశాల్లో మాత్రమే హైటెక్ బాత్రూంలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ ఇళ్లలోకి హైటెక్ సౌకర్యాలతో బాత్రూంలు వచ్చేశాయి. అందుకే ప్రస్తుతం బాత్రూమ్ అంటే కేవలం రోజువారీ అవసరాలు తీర్చుకునే చోటు మాత్రమే కాదు… లగ్జరీ, టెక్నాలజీని కేంద్రాలు. ముఖ్యంగా 'స్మార్ట్ టాయిలెట్లు', 'వాష్లెట్లు' ఆధునిక ఇళ్లలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. టాయిలెట్, బిడెట్ (నీటితో శుభ్రపరిచే సిస్టమ్) రెండింటినీ ఒకే యూనిట్లో కలిగినవే ఈ స్మార్ట్ టాయిలెట్లు. వీటిలో నీటి ఉష్ణోగ్రత, ప్రెజర్, నీరు వచ్చే దిశను మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. కొన్ని మోడళ్లలో హీటెడ్ సీట్లు, గోరువెచ్చని గాలితో ఆరబెట్టే డ్రైయర్, ఆటోమేటిక్ సెన్సర్లు కూడా ఉంటాయి. ఇలా టెక్నాలజీ సాయంతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్స్ నే వాష్ లెట్స్ అనికూడా అంటారు. స్మార్ట్ టాయిలెట్స్ లేదా వాష్ లెట్స్ ప్రధాన ప్రయోజనాలు ఇవే… టాయిలెట్ పేపర్ అవసరం లేదు : నీటితో శుభ్రం చేసే వ్యవస్థ ఉండటంతో టాయిలెట్ పేపర్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. ఇది పర్యావరణానికి కూడా మంచిది. మెరుగైన పరిశుభ్రత : పేపర్‌తో పోలిస్తే నీటితో కడుక్కోవడం చాలా ప్రభావవంతంగా, శుభ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ స్పర్శ, ఎక్కువ భద్రత : ఆటోమేటిక్ సెన్సర్లు ఉండటంతో టాయిలెట్‌ను పదేపదే చేత్తో తాకాల్సిన అవసరం ఉండదు. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిని అరికడుతుంది… ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పర్యావరణ హితం : టాయిలెట్ పేపర్ తయారీకి చాలా చెట్లు నరకాల్సి వస్తుంది. ఈ టెక్నాలజీ వాడకం వల్ల కాగితం వాడకం తగ్గి, సహజ వనరులను కాపాడవచ్చు. సౌకర్యం : చలికాలం లేదా వర్షాకాలంలో టాయిలెట్ సీటును వేడిగా మార్చుకోవచ్చు. నీటిని కూడా మనకు నచ్చిన టెంపరేచర్ లో వాడుకోవచ్చు. దీంతో చాలా సౌకర్యవతంగా ఉంటుంది. స్మార్ట్ టాయిలెట్లలో సెల్ఫ్-క్లీనింగ్ (స్వయంగా శుభ్రం చేసుకునే) వ్యవస్థ ఉన్నప్పటికీ, వాటిని అప్పుడప్పుడు మాన్యువల్‌గా శుభ్రపరచడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా