
ఈ స్మార్ట్ ప్లగ్ 10A సామర్థ్యంతో రూపొందించారు. టీవీలు, హీటర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి పరికరాలను దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. పాలీకార్బొనేట్ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ ప్లగ్ కాంపాక్ట్ డిజైన్‌లో ఉంటుంది. చిన్న పరిమాణం కారణంగా ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. అయితే ఏ పరికరాన్నైనా కనెక్ట్ చేసే ముందు దాని పవర్ అవసరాలు, స్మార్ట్ ప్లగ్ సామర్థ్యానికి అనుగుణంగా ఉన్నాయో చూసుకోవడం మంచిది. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడక్ట్ ధర రూ. 890గా ఉంది. ఈ స్మార్ట్ ప్లగ్‌లోని Wi-Fi కనెక్టివిటీ ప్రధాన ఆకర్షణ. ఇంట్లో ఉన్న పరికరాన్ని స్మార్ట్ ప్లగ్‌కు కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్ యాప్ ద్వారా రిమోట్‌గా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. అంటే మీరు ఇంటికి దూరంగా మరో నగరంలో లేదా ప్రపంచంలో ఎక్కడో ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు యాప్ ద్వారా కనెక్ట్ చేసిన పరికరాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయినా.. మొబైల్ ద్వారా స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ప్రతిరోజూ ఒకే సమయంలో కొన్ని పరికరాలను ఆన్ లేదా ఆఫ్ చేయాల్సి వస్తే వాటి కోసం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ స్మార్ట్ ప్లగ్‌లో టైమర్, షెడ్యూలింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఉదయం ఒక నిర్దిష్ట సమయంలో పరికరం ఆన్ కావాలని, రాత్రి ఒక నిర్దిష్ట సమయంలో ఆఫ్ కావాలని ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇలా రోజువారీ పనులను ఆటోమేటిక్‌గా నిర్వహించుకోవడంతో విద్యుత్ వృథాను కూడా కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యాప్‌తో పాటు అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా కూడా ఈ ప్లగ్‌ను నియంత్రించవచ్చు. వాయిస్ కమాండ్‌తో కనెక్ట్ చేసిన పరికరాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. అలాగే ఇంట్లోని ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ పరికరాలను గ్రూప్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కంట్రోల్