మనీ ప్లాంట్‌కు ఎక్కువగా నీళ్లు పోయకూడదు. పైన నేల పూర్తిగా ఎండిన తర్వాతే నీళ్లు పోయాలి. నేల ఎప్పుడు నీళ్లతో నిండి ఉంటే మొక్క తొందరగా పాడైపోతుంది. మనీ ప్లాంట్ నేరుగా సూర్యరశ్మి అవసరం లేదు. కానీ వెలుతురు మాత్రం అవసరం. కొంతమంది సూర్యరశ్మి అవసరం లేదని చీకట్లో పెడుతుంటారు. దీనివల్ల మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారతాయి. అందుకే వీలైనంత వరకు తూర్పు దిశలో ఉన్న కిటికీ దగ్గర మనీ ప్లాంట్ పెట్టడం మంచిది. చిన్న కుండీలో మొక్క ఎక్కువ ఎత్తు పెరిగే అవకాశం ఉండదు. అందుకే మొక్క తీగ ఎక్కువగా పెరగాలంటే కుండీ కాస్త పెద్దదిగా ఉంచండి. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎరువులు చాలా అవసరం. అయితే మనీ ప్లాంట్‌కు పెద్దగా అవసరం లేదు. కానీ నెల, రెండు నెలలకు ఓసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ వేయడం మంచిది. మరీ ఎక్కువ వేసినా మొక్క పాడైపోతుంది.జాగ్రత్త. మనీ ప్లాంట్ పెంచే కుండీకి డ్రైనేజీ సరిగా ఉండేలా చూసుకోండి. కుండీ కింద చిన్న రంధ్రం లాంటిది ఉంటే వాటర్ బయటకు పోతాయి. దీంతో మట్టి లూజ్‌గా మారకుండా ఉంటుంది. మొక్క హెల్తీగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ తీగలాగా పెరుగుతుంది. కాబట్టి దానికి సపోర్ట్ చాలా అవసరం. ఏదైనా పోల్ లేదా తీగను మొక్కకు కడితే దాని సపోర్ట్‌తో మొక్క ఎత్తుకు పెరుగుతుంది. ఆకులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రూనింగ్ (అనవసర ఆకులు కట్ చేయడం) చాలా అవసరం. దీనివల్ల మొక్క మరింత ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతుంది. ఈ కట్ చేసిన ఆకులను కుండీలో వేస్తే తగినంత న్యూట్రిషన్ కూడా అందుతుంది. మనీ ప్లాంట్ ఆకులపై దుమ్ము ఎక్కువగా పేరుకుపోతే తొందరగా పాడైపోతాయి. కాబట్టి కనీసం రెండు వారాలకు ఒకసారి ఆకులను తడి క్లాత్‌తో శుభ్రంగా క్లీన్ చేయండి. కొంతమంది బాటిల్ నీళ్లలో మనీ ప్లాంట్ పెంచుతుంటారు. ఇలాంటి వారు