© 2026 nimisham.in
తలకు రక్త ప్రసరణ మెరుగుపర్చి జుట్టుకు కావాల్సిన పోషణ అందించడంలో ఈ చిట్కా సహాయపడుతుంది. దీనికోసం బెడ్ మీద పడుకుని తలను, జుట్టును కిందకు వాలేలా చేయండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రెండు చేతి వేళ్ల గోళ్లను రాపిడి చేస్తూ ఉండటం ద్వారా జుట్టు పెరుగుతుందని చెబుతారు. దీనినే బలయామ్ యోగా అని పిలుస్తారు. అందుకే రోజులో ఒకసారి ఈ చిట్కా పాటించండి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఆయిల్ మసాజ్ తప్పనిసరి. కానీ చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొబ్బరి నూనె, బాదం, నూనె, ఆముదం నూనె ఇందులో ఏదో ఒక నూనె తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపడు తలకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే సరిపోతుంది. చర్మాన్ని మెరిపించడమే కాకుండా జుట్టును ఒత్తుగా మార్చడంలో బియ్యం నీళ్లు సహాయపడతాయి. దీనికోసం నీళ్లలో బియ్యం గంటసేపు నానబెట్టి ఈ నీటితో తలను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఉపయోగించే పిల్లో (తలగడ) కూడా మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కుదుళ్లలో రాపిడి తగ్గాలంటే వీలైనంత వరకు సిల్క ్లేాద సాటిన్ పిల్లో వాడటం అలవాటు చేసుకోండి. దీనివల్ల కుదుళ్లలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జుట్టు హెల్తీగా పెరుగుతుంది. జుట్టు హెల్తీగా పెరిగేందుకు ప్లాస్టిక్ దువ్వెన కంటే చెక్క దువ్వెన ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే దువ్వెన దంతాలు వెడల్పుగా ఉండాలి. అప్పుడు రాపిడి తగ్గి జుట్టు హెల్తీగా పెరుగుతుంది. తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం, దువ్వడం చేయకూడదు. ఎందుకంటే తడి జుట్టు సెన్సిటివ్‌గా ఉండి తొందరగా రాలుతుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలి. అలాగే జుట్టు ఆరబెట్టేందుకు హీట్ పరికరాలు వాడొద్దు. ఇంట్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉంటాయి. వీటితోనే మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. దీనికోసం ఉల్లిపాయల నుంచి రసం తీసి తలకు రాసుకోండి
. గంట తర్వాత తలస్నానం చేయండి. వారంలో ఒక్కసారి ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
మహిళల్లో జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉండేందుకు ట్రిమ్ చేయడం చాలా అవసరం. కనీసం నెలకు ఓసారి చివర్లను ట్రిమ్ చేయండి. దీంతో జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.