
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలోని వ్రతాలు, పూజలు అన్నీ భక్తిభావంతోనే కాక సామాజిక క్షేమాన్ని కాంక్షిస్తూ కూడా జరుగు తుంటాయి. అలాంటి పూజలు, వ్రతాలకు శుభప్రదం... శ్రావణమాసం. చాంద్రమానం ప్రకారం వర్ష రుతువులో వచ్చే ఐదవ నెల ఇది. పౌర్ణమి ఏ నక్షత్రంతో కూడుకుని వేస్త ఆ మాసానికి ఆ పేరొస్తుంది. శ్రవణా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కనుక దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఈ మాసానికి భారతీయ జీవన విధానంలో ఎంతో విశిష్ట స్థానం ఉంది. లక్ష్మీదేవి, పరమశివుడు, మహా విష్ణువు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఆరాధనకే కాక కొందరు దైవాంశ స్వరూపులు, కారణజన్ములు జనించిన మాసమిది. వ్రతాచరణకు ఎంతో అనుకూలమైనది. గౌరీదేవి ఆరాధన... శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి పూజలు, నోములు, వ్రతాలు గుర్తుకువస్తాయి. ఈ మాసంలో వచ్చే ప్రతీ మంగళవారం, శుక్ర వారం మహిళలకు ఎంతో ముఖ్యం. కొత్తగా పెళ్ళైన ముత్తైదువలు ఐదేళ్లపాటు ఈ మాసంలో ‘మంగళగౌరి వ్రతం’ ఆచరిస్తారు. తమ సౌభాగ్యం నిలిచి ఉండాలని, భర్త ఆయు రారోగ్యాలతో వర్థిల్లాలని గౌరీదేవిని భక్తితో ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన పండుగ ‘వరలక్ష్మీ వ్రతం’. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. ఒకవేళ ఆ రోజు వీలు కాకుంటే ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా వరలక్ష్మీ పూజ చేసుకో వచ్చు. ఇళ్లను తోరణాలతో, ముగ్గులతో అలంకరించి, కలశాన్ని స్థాపించి, లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. తొమ్మిది పోగుల తోరానికి పూజ చేసి చేతికి కట్టుకుంటారు. ముత్తైదు వులను పిలిచి తాంబూలాలు, వాయనాలు ఇవ్వడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. శ్రావణ మాసం కేవలం విష్ణు, లక్ష్మీ ఆరాధనకే కాదు... శివారాధనకు కూడా పరమ పవిత్రమైనది. ఉత్తర భారతదేశంలో ఈ మాసాన్ని ‘సావన్’ అని పిలుస్తూ పూర్తిగా శివునికి చేేస పూజలు, అభిషేకాలకు తమ సమయాన్ని అంకితం