© 2026 nimisham.in
శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లూ కళకళలాడిపోతుంది. పూజలు, వ్రతాలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.హిందువులకు శ్రావణ మాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. మహిళలు తాము ముస్తాబవ్వడమే కాకుండా ఇంటిని కూడా చూడచక్కని విధంగా అలంకరిస్తారు. దాంతో ప్రతి శుభకార్యంలో తప్పక కావాల్సిన తమలపాకు ధరకు రెక్కలు వచ్చాయి. ప్రతీ తాంబూలంలోనూ తమలపాకే ముఖ్యం. తమలపాకు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. దాంతో తమలపాకుతో పాటు అరటిపళ్లు, కొబ్బరి కాయలు, పూల రేట్లకు రెక్కలు వచ్చాయి.రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న చింతలపూడి, మాచవరం, ములుకుదురు ప్రాంతాల్లో తమలపాకు తోటలు ఉన్నాయి. రైతు వద్ద తక్కువకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. తమ కొట్లల్లో మాత్రం భారీగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే పండగ సీజన్లో తమలపాకుకు ఉన్న డిమాండ్ అలాంటిది. రైతు వద్ద 150 ఆకుల కట్టను రూ. 16కు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. విడిగా ప్రజలకు మాత్రం ఒక్కొక్కటి రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో అయితే 30 ఆకులను రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు.READ ALSO గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!తమలపాకుతో పాటు కొబ్బరి కాయలు కూడా భారీగా పెరిగాయి. శ్రావణ మాసానికి ముందు కొబ్బరి కాయ సైజును బట్టి రూ. 15 నుంచి రూ. 35 మధ్య అమ్మేవారు. ప్రస్తుతం మీడియం సైజు కాయ ధరే రూ. 50 ఉంది. అరటి పళ్లు కూడా గతంలో డజను రూ. 40 నుంచి రూ. 60 వరకు అమ్మేవారు. ఇప్పుడు అదే అరటి కాయ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. యావరేజ్‌గా రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మేస్తున్నారు.వర్షాభావ పరిస్థితుల్లో పూలకు మంచి డిమాండ్ పెరిగింది. వర్షాలు సరిగా లేకపోవడంతో కాల్వల కింద, బోర్ల కింద పండిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. గతంలో రూ. 200 లోపే
ఉండే చిట్టి గులాబీలు ఇప్పుడు రూ. 350 నుంచి రూ. 400 వరకు అమ్ముతున్నారు. చామంతులు రూ. 150 ఉంటే ఇప్పుడు రూ. 350 పెరిగింది. బంతి పూలు కిలో రూ. 30 ఉంటే రూ. 70కి పెరిగాయి. మొత్తానికి శ్రావణమాసంలో పూజలకు ఉపయోగించే సామగ్రి సామాన్యుడి నడ్డి విరుస్తుంది.