, పూజలు నిర్వహిస్తారు. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తుంటారో వారందరూ పుట్టలో పాములకు పాలుకు పోయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి అంటారు. ఈసారి 28 ఆగస్టు 2026 మూడో శుక్రవారం నాడు రక్షా బంధన్ పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వేడుకలను జరుపుకుంటారు. ఆ తర్వాత తమ సోదరుల నుంచి కానుకలను స్వీకరిస్తారు. ఈ పవిత్రమైన రోజునే శ్రవణ నక్షత్రం కూడా వస్తుంది. శ్రీవారి తిరు నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 04 ఆగస్టు 2026 శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు.
శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున శనీశ్వరుడిని పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ, సౌభాగ్య నోములు వంటివి నోచుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అదేవిధంగా గ్రహాల అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తిరుమల వెంకన్న జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ నెలలో తిరుమల వెంకన్న దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు. తమ ఇంటి దేవుడైన వెంకన్నస్వామిని శనివారం రోజున ఉపవాస దీక్ష ఉండి దర్శనం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా శ్రావణ మాసంలోని ప్రతి శనివారం స్తంభం లేదా గోడలపై నరసింహ స్వామి అవతారాన్ని ఉంచి పూజిస్తారు. ప్రహ్లాదుని కోసం విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు. దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామి వారి చిత్రాన్ని పూజిస్తారు. గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Religion News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి