రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లాలో ప్రయివేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 11న కొండమల్లెపల్లిలోని తన ఇంట్లోనే రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించినట్టు సమాచారం. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను అదే పాఠశాలలో చదివిన కొండమల్లెపల్లి మండలానికి చెందిన వంశీ, అనిల్ అనే విద్యార్థులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. డబ్బుల కోసం ఆశపడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం.హత్య అనంతరం వీరు గోవాకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో విద్యార్థులే హంతకులుగా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పోలీసులు దాదాపు 80 మందిని విచారించిన అనంతరం ఆ విద్యార్థులే హత్య చేశారని గుర్తించినట్లు సమాచారం. రూపారెడ్డిను హత్యచేసిన అనంతరం ఆమె ఇంట్లోని సుమారు రూ.4 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రూపారెడ్డిని హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .. దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ప్రిన్సిపాల్‌ను హత్య చేసింది నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులేనని దర్యాప్తులో గుర్తించారు. జల్సాలకు అలవాటుపడి డబ్బుకోసమే ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడైంది. ఈ హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత లోతుగా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.కొండమల్లేపల్లి జేబీ కాలనీలో రూపారెడ్డి నివాసం ఉంటున్నారు. నాగార్జున గ్రామర్ స్కూల్ నిర్వహకురాలైన ఆమె ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోనూ వీరికి సొంత ఇల్లు ఉంది. ఆమె కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెలవుల్లో హైదరాబాద్‌కు వెళ్లి కుమారుడితోపాటే గడుపుతారు. ఈ క్రమంలోనే ఆగస్టు 8 నుంచి 10 వరకు వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో… భర్తతో కలిసి హైదరాబాద్‌లోని తన కుమారుడి వద్దకు ఆమె వెళ్లారు. తిరిగి ఆగస్టు 11న