
ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కావడం అంత తేలికైన విషయం కాదు. ముందుగా నిర్మాతను .. ఆ తరువాత హీరోను .. హీరోయిన్ ను .. చివరికి ఆడియన్స్ ను ఒప్పించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. ఇక మొదటి సినిమాతో హిట్ కొట్టడటం కూడా అందరి విషయంలో జరిగేది కాదు .. దాదాపుగా అది ఒక అద్భుతం లాంటిదేనని చెప్పాలి. అలాంటి అద్భుతాన్ని అవలీలగా సాధించిన దర్శకుడిగా శివ నిర్వాణ కనిపిస్తాడు. 'నిన్ను కోరి'.. 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ మూవీస్ ను తెరకెక్కించిన శివ నిర్వాణ, రవితేజ హీరోగా 'ఇరుముడి' సినిమాను రూపొందించాడు. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "అప్పట్లో నేను సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడిని. ఆ సమయంలోనే నేను 'రక్తచరిత్ర' సినిమా షూటింగుకి వెళ్లాను. ఎందుకంటే నాకు రాముగారు అంటే పిచ్చి. ఆ రోజున కూలర్ బాయ్ రాలేదు. నాకేం డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి నేను కూలర్ బాయ్ గా మారాను" అని అన్నారు. "వర్మగారి దగ్గరగా ఉండటం కోసం, కూలర్ బాయ్ తో మాట్లాడుకుని ఆ పనిని నేనే చేస్తూ వెళ్లాను. వర్మగారు డైరెక్షన్ చేసే తీరును దగ్గరగా చూస్తూ వెళ్లాను. ఆయన మేకింగ్ స్టైల్ చూసి నేను షాక్ అయ్యేవాడిని. ఆయన షాట్స్ ను నేను ఎప్పటికప్పుడు రాసుకునేవాడిని. అవి ఆ తరువాత కాలంలో నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. దాదాపు ఒక