
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ (Irumudi) ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంతో ఫ్యామిలీ, క్రైమ్ అంశాలను మేళవించిన ఈ చిత్రంపై దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు ఆయన మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఇరుముడి’లో రామ్ చరణ్ (Ram Charan) కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై శివ నిర్వాణ స్పందించారు. “రామ్ చరణ్ గారు సినిమాలో కనిపించరు. అది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఆయన అయ్యప్ప భక్తుడు కావడంతో, ఆ వైబ్ ఉంటుంది. బహుశా అభిమానులు అలా కోరుకుని ఉంటారు. కానీ ఈ సినిమాలో చరణ్ గారు కనిపిస్తారన్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా ఆయనకు నచ్చాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. ‘ఇరుముడి’ని మలయాళ చిత్రం ‘మాలికాపురం’తో పోల్చడంపై కూడా దర్శకుడు స్పందించారు. సినిమాలో అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, ఫ్యామిలీ, క్రైమ్ అనే మూడు ప్రధాన లేయర్లు ఉంటాయని తెలిపారు. “అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో, ఫ్యామిలీ, క్రైమ్ అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి కథను రవితేజ లాంటి స్టార్ హీరోతో చేస్తే దాని రీచ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా సౌత్‌లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అందుకే పోలికలు రావడం సహజం. ‘మాలికాపురం’తో కూడా పోల్చారు. అయితే నా సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు. ఇది చాలా యూనిక్ ఫిల్మ్. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు” అని అన్నారు. “ఇరుముడి’ కథ రాసుకున్నప్పుడు రవితేజను దృష్టిలో పెట్టుకోలేదని శివ నిర్వాణ తెలిపారు. అయితే కథ చెప్పిన తర్వాత ఈ పాత్రకు రవితేజ పర్ఫెక్ట్గా సరిపోతారని భావించినట్లు చెప్పారు. “ఆయన గడ్డం, తేజస్సు ఈ పాత్రకు అద్భుతంగా సరిపోయాయి. రవితేజ