
'నారి నారి నడుమ మురారి', 'బైకర్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న 'చార్మింగ్ స్టార్' శర్వా, తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టారు. ATV సమర్పణలో, అనిల్ సుంకర AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ప్రత్యేకమైన డిజైన్‌తో వెంటనే దృష్టిని ఆకర్షించేలా ఉన్న కలర్ ఫుల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం టైటిల్, విడుదల తేదీని ప్రకటించింది. 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'నారి నారి నడుమ మురారి' వంటి చిత్రాలతో పండుగ సీజన్లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ప్రత్యేకమైనది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, 'జార్జ్ క్రిష్' చిత్రం 2027 జనవరి 14న పండుగ సీజన్లో విడుదల కానుంది. ఈ టైటిల్ పోస్టర్ పసుపు-నారింజ రంగుల నేపథ్యంతో, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే సాంప్రదాయ అలంకరణలతో అలరారుతోంది. టైటిల్ బోల్డ్, స్టైలిష్‌గా చేతిరాతలో ఒక 'అవర్ గ్లాస్' డిజైన్‌లో, నల్లని బ్రష్-స్ట్రోక్ అవుట్లైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టైటిల్ డిజైన్‌లో శర్వా హీరోయిన్ను చేతుల్లోకి ఎత్తుకున్న చిన్న సిల్హౌట్ ను కూడా పొందుపరిచారు, ఇది చిత్రంలోని రొమాంటిక్ అంశాన్ని ప్రజెంట్ చేస్తోంది, సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో 'జార్జ్ క్రిష్' చిత్రం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ లు నిర్మాత సురేష్ బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి బలమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్. నందు