
సిద్దిపేట జిల్లాలో కలకలం రేపిన మహిళల వరుస హత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. డబ్బు, బంగారం కోసం కన్న కొడుకు (మైనర్)తో కలిసి ఓ మహిళే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు తేల్చారు. ఇద్దరు మహిళలను గొంతు నులిమి హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రమేశ్ మీడియాకు వెల్లడించారు.దుబ్బాక మండలం భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, మైనర్ కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఓ కిరాణా దుకాణం నడుపుతున్న ఆమె, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో హత్యలకు పథకం పన్నింది. తన మైనర్ కొడుకును కూడా ఈ నేరంలో భాగస్వామిని చేసింది. ఒంటరిగా ఉండే మహిళలను, కుటుంబ తగాదాలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటే అనుమానం తమపైకి రాదని భావించి పక్కా ప్రణాళికతో హత్యలు చేశారు.ఈ ఏడాది మే నెలలో రేఖ (25) అనే యువతిని తొలి టార్గెట్గా ఎంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో చురుగ్గా ఉండే ఆమెను హత్య చేస్తే, ఎవరైనా కిడ్నాప్ చేశారనే అనుమానాలు వస్తాయని భావించారు. ఆమెను చంపి, ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకుని, మృతదేహాన్ని అడవిలో కాల్చివేశారు. ఇక ఈ నెల 7న భూతగాదాలు ఉన్న అతికం విజయ (45)ను రెండో లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె హత్యకు గురైతే అనుమానం ఆమె దాయాదులపైకి వెళ్తుందని ప్లాన్ చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించగా వర్షం పడటంతో, రామక్కపేట వద్ద రోడ్డు పక్కన సగం కాలిన