
ప్రముఖ సీనియర్ సినీ నటి షావుకారు జానకి (95) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా.. 1950ల్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికల్లో షావుకారు జానకి ఒకరు. 'షావుకారు' సినిమాతో పరిచమైన ఆమెకు సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్గా రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) 'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు) మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు) బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ ఫోటో మార్ఫింగ్ వివాదం..! కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గం కుట్ర వెళ్తూ వెళ్తూ.. అబ్బా కొడుకులకు జగన్ ఓపెన్ ఛాలెంజ్ DSC స్కాం పై మరో సంచలనం ఆడియో వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్ కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు.. పోస్టుకు 14 లక్షలు తీసుకున్నారు. ధర్మేంధ్ర ప్రధాన్ కో రూల్ నీకో రూలా..?