ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో సెప్టెంబర్ 3న ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్ ప్రచురించాలని ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. అలాగు ఈ నెల 17న గతంలో ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా సన్నద్ధంగా ఉండేలా అధికారులు, జిల్లాల యంత్రాంగాలను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఇప్పటికే మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. అందుకే తొలి అడుగుగా ఓటర్ల జాబితాల ప్రకటన చేయనున్నారు. ఈనెల 21నుంచి 31 వరకు గ్రామ పంచాయతీల్లోనూ పోలింగ్ స్టేషన్లు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని 13వేలకుపైగా గ్రామపంచాయతీలు, వందకుపైగా మున్సిపాలిటీలకు సంబంధించి ఫొటో ఓటర్ల జాబితాల ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 4,033 డివిజన్లు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించాలి. వీటిలో 17 కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. 2021లో కోర్టు కేసుల కారణంగా 00 చోట్లే ఎన్నికలు జరిగాయి.. కానీ ఈసారి అన్నిచోట్లా ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈనెల 21 నుంచి 31లోగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల జాబితాలు ప్రచురిస్తారు.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఖరారు చేస్తారు. 2026 జనవరి ఒకటికి ఓటు అర్హత పొందిన వారితో ఉన్న ఓటర్ల జాబితాల నుంచి జాబితాలను ప్రకటిస్తారు. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్మన్లు, డివిజన్ కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలకమైన నోటిఫికేషన్