
మాంసాహారులు ఎక్కువగా ఇష్టపడే ఆహారాల్లో చేపలు ఎక్కువగా ఉంటాయి. అద్భుతమైన రుచితో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే, చేపలు కొనేటప్పుడు మనలో చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. సముద్రపు చేపలు మంచివా? లేక నదీ చేపలు మంచివా? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణులు ఏమంటున్నారు..? చేప రకం, అది పెరిగే వాతావరణం, తినే ఆహారాన్ని బట్టి చేపల్లోని పోషకాల పరిమాణం మారిపోతూ ఉంటుంది. సముద్రపు చేపలు, నదిలో పెరిగే చేపలు ఈ రెండింటికీ ఉన్న తేడా ఏంటి? ఈ రెండింటిలో ఏది తింటే ఎక్కువ పోషకాలు అందుతాయో ఇప్పుడు చూద్దాం... సముద్రపు చేపలు ఆహార ప్రియులకు మాత్రమే కాకుండా, గుండె ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఇవి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఒమేగా-3 నిధి: సముద్రపు చేపలలో 'ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు' (EPA & DHA) చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన గుండె, మెదడు, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నాణ్యమైన ప్రోటీన్ & మినరల్స్: వీటిలో సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్‌తో పాటు అయోడిన్, విటమిన్-డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త : షార్క్, స్వోర్డ్‌ఫిష్ వంటి పెద్ద సముద్రపు చేపలు ఎక్కువ కాలం జీవించడం వల్ల వాటి శరీరంలో 'పాదరసం' (Mercury) చేరుతుంది. ఇలాంటి చేపలను తినడం వల్ల వాటిలోని పాదరసం నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు పెద్ద సముద్రపు చేపలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న సముద్రపు చేపలు తినడం సురక్షితం. మన ఊళ్లలో, మార్కెట్లలో సులభంగా లభించే నదీ, చెరువు చేపలకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అద్భుతమైన ప్రోటీన్ వనరు: శరీర కండరాల నిర్మాణానికి, కణాల