
School Holidays : సెలవులు... ఈ మాట వినిపిస్తే చాలు స్కూల్ విద్యార్థులే కాదు ఉద్యోగులు ఎగిరిగంతేస్తారు. ఒకటి రెండ్రోజులు సెలవులు వస్తేనే మురిసిపోతుంటారు... అలాంటిది ఈ నెల (ఆగస్ట్) లో ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వచ్చాయి. ఇకపై కూడా బాగానే సెలవులు రాబోతున్నాయి. వచ్చేవారం ఎన్నిరోజులు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ శనివారం (ఆగస్ట్ 15న) స్వాతంత్య్ర దినోత్సవం... ఈ జాతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఉద్యోగులకు కూడా ఈరోజు అధికారిక సెలవే. అయితే పారసీ న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉంది. దీని అవసరం లేకుండానే సెలవు వస్తోంది. ఇది వీకెండ్ సెలవుతో కలిసివస్తోంది... అందుకే రెండ్రోజుల సెలవులున్నాయి. ఆగస్ట్ 16న ఆదివారం సాధారణ సెలవే. దీనికి స్వాతంత్య్ర దినోత్సవ సెలవు కలిసిరావడంతో ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ రెండ్రోజులు మూతపడనున్నాయి. అంటే తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఈ రెండ్రోజులు పండగే అన్నమాట. ఆషాడ మాసం ముగిసి శ్రావణ మాసం వస్తోంది... ఈ నెలను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు కుటుంబం, భర్త బాగుండాలని ఈ నెలలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు. ఉద్యోగాలు చేసే తెలుగు మహిళలు కూడా ఈ వ్రతం జరుపుకుంటారు... వీరికోసమే ఆగస్ట్ 21న (శుక్రవారం) వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావాలనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు... కానీ ఇది అధికారిక సెలవు కాదు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్ట్ 21న సెలవు తీసుకుంటే వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసిరానున్నాయి. ఇక ఆగస్ట్ 22న శనివారం, ఆగస్ట్ 23న ఆదివారం... చాలామంది ఉద్యోగులకు వీకెండ్ లో రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలా కొందరు