
ఎస్బీఐ, పీఎన్బీ FD కస్టమర్లకు పండగే 2 ఏళ్ల ఎఫ్డీ ఖాతాలపై ఎందులో వడ్డీ ఎంతంటే? ఏ వయస్సు వారికి ఎంతవరకు బెనిఫిట్స్ పొందొచ్చు SBI vs PNB FD Rates : మీరు ఎఫ్డీలపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? మంచి రాబడిని పొందాలంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అందించే ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ల నుంచి సూపర్ సీనియర్ల వరకు అందరూ ఫిక్స్ డ్ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో రెండు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లలో లక్షలాది (SBI vs PNB FD Rates) మందికి ఎఫ్డీ ఖాతాలు ఉన్నాయి. మీరు రాబోయే రెండు ఏళ్ల పాటు మీ సేవింగ్స్ మొత్తాన్ని FDలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీ డబ్బుపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రాబడిని అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. 2 ఏళ్ల ఎఫ్డీపై SBI వడ్డీ ఎంతంటే? : ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు రెండేళ్ల ఎఫ్డీలపై 6.40శాతం నుంచి 7.05శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ ఎస్బీఐ బ్యాంకు 2 ఏళ్లు లేదా 24 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎఫ్డీ ఖాతాలపై 59 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లందరికి 6.40శాతం వడ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న కస్టమర్లకు రెండేళ్ల ఎఫ్డీ పథకాలపై 6.96శాతం వడ్డీని అందిస్తున్నాయి. అంతేకాదు.. 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రెండేళ్ల ఎఫ్డీ ఖాతాలపై 7.05శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు కేవలం రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. Read Also : Huawei Pura X View : స్టూడెంట్స్, గేమర్స్కి సూపర్ ఛాయిస్.. హువావే పురా ఎక్స్ వ్యూ