
Banking Jobs : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు యువతకు లక్కీ ఛాన్స్. ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏకంగా 1538 జూనియర్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేయనుంది… ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు… కాబట్టీ మీ బ్యాంక్ జాబ్ కలను నెరవేర్చుకునేందకు ఇదే మంచి సమయం. బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువతీయువకులు, అర్హత గల అభ్యర్థులు ఈనెల (ఆగస్టు) 27వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది… కాబట్టి చివరి నిమిషం వరకు ఆగకుండా అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అప్లై చేయడం మంచిది. ఎస్బిఐ లో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీస వయస్సు 20 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు (ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్ కలిగినవారికి) వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన విద్యార్హతలు, రిజర్వేషన్, ఇతర అర్హతల పూర్తి వివరాల కోసం దరఖాస్తు చేసే ముందు ఎస్బీఐ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను తప్పకుండా చెక్ చేసుకోవాలి. అన్ని అర్హతలు ఉంటేనే దరఖాస్తు చేసుకొండి. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఎంపిక ప్రక్రియ పలు దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది 100 మార్కులకు, గంట వ్యవధితో ఉండే ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు హాజరుకావొచ్చు. ఈ మెయిన్స్ పరీక్షను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో నిర్వహించనున్నట్లు SBI నోటిఫికేషన్ లో తెలిపారు. పరీక్ష తేదీలపై తుది ప్రకటనను ఎస్బీఐ అధికారికంగా విడుదల చేస్తుంది. ఇందులో