© 2026 nimisham.in

భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఒక భారీ అవకాశం వచ్చింది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్) తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)ను నేటి నుంచి సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి తెచ్చింది. దాదాపు రూ.10,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓపై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి.కీలక వివరాలు ఇవే..ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో జరుగుతోంది. అంటే ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను అమ్ముతున్నారు తప్ప, ఈ డబ్బు కంపెనీ సొంత అవసరాలకు ఉపయోగపడదు.ఐపీఓ తేదీలు: జూలై 14న ప్రారంభమై, జూలై 16న ముగుస్తుంది.ధరలు: షేరుకు రూ.545 నుంచి రూ.574 గా నిర్ణయించారు.లాట్ సైజ్ (Lot Size): కనీసం 26 షేర్ల కోసం బిడ్ వేయాలి.కనీస పెట్టుబడి: గరిష్ట ధర (రూ.574) ప్రకారం ఒక లాట్ కొనడానికి రూ.14,924 అవసరం అవుతుంది.లిస్టింగ్: ఈ షేర్లు బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE)లలో లిస్ట్ కానున్నాయి.వాటాలు అమ్ముతోంది ఎవరు?ఈ ఐపీఓ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), అమండీ ఇండియా హోల్డింగ్ సంస్థలు తమ వద్ద ఉన్న వాటాలను విక్రయిస్తున్నాయి. ఐపీఓ పూర్తయిన తర్వాత కూడా ఎస్బీఐ మెజారిటీ వాటాతోనే ప్రమోటర్గా కొనసాగుతుంది.SBI: 30 ఏళ్ల క్రితం 80 పైసల బెట్’.. ఇప్పుడు వేల కోట్ల జాక్పాట్’ఇన్వెస్టర్లు అప్లై చేయవచ్చా?ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్లో తిరుగులేని బ్రాండ్ వాల్యూ, విస్తృతమైన నెట్వర్క్, మంచి లాభాలు ఉన్న సంస్థ. దేశంలో మ్యూచువల్ ఫండ్ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో, ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న కంపెనీలో భాగస్వామ్యం కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.రాత్రికి రాత్రే కోటీశ్వరులు! ఉద్యోగులకు జాక్పాట్ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) అయినందున, వచ్చే డబ్బు కంపెనీ వ్యాపార విస్తరణకు వెళ్లదు. కాబట్టి కేవలం
భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఒక భారీ అవకాశం వచ్చింది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్) తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)ను నేటి నుంచి సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి తెచ్చింది. దాదాపు రూ.10,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓపై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి.కీలక వివరాలు ఇవే..ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో జరుగుతోంది. అంటే ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను అమ్ముతున్నారు తప్ప, ఈ డబ్బు కంపెనీ సొంత అవసరాలకు ఉపయోగపడదు.ఐపీఓ తేదీలు: జూలై 14న ప్రారంభమై, జూలై 16న ముగుస్తుంది.ధరలు: షేరుకు రూ.545 నుంచి రూ.574 గా నిర్ణయించారు.లాట్ సైజ్ (Lot Size): కనీసం 26 షేర్ల కోసం బిడ్ వేయాలి.కనీస పెట్టుబడి: గరిష్ట ధర (రూ.574) ప్రకారం ఒక లాట్ కొనడానికి రూ.14,924 అవసరం అవుతుంది.లిస్టింగ్: ఈ షేర్లు బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE)లలో లిస్ట్ కానున్నాయి.వాటాలు అమ్ముతోంది ఎవరు?ఈ ఐపీఓ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), అమండీ ఇండియా హోల్డింగ్ సంస్థలు తమ వద్ద ఉన్న వాటాలను విక్రయిస్తున్నాయి. ఐపీఓ పూర్తయిన తర్వాత కూడా ఎస్‌బీఐ మెజారిటీ వాటాతోనే ప్రమోటర్‌గా కొనసాగుతుంది.SBI: 30 ఏళ్ల క్రితం 80 పైసల బెట్’.. ఇప్పుడు వేల కోట్ల జాక్‌పాట్’ఇన్వెస్టర్లు అప్లై చేయవచ్చా?ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్లో తిరుగులేని బ్రాండ్ వాల్యూ, విస్తృతమైన నెట్‌వర్క్, మంచి లాభాలు ఉన్న సంస్థ. దేశంలో మ్యూచువల్ ఫండ్ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో, ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న కంపెనీలో భాగస్వామ్యం కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.రాత్రికి రాత్రే కోటీశ్వరులు! ఉద్యోగులకు జాక్‌పాట్ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) అయినందున, వచ్చే డబ్బు కంపెనీ వ్యాపార విస్తరణకు వెళ్లదు. కాబట్టి కేవలం ఐపీఓ క్రేజ్ లేదా సబ్‌స్క్రిప్షన్ నంబర్లను చూసి కాకుండా, కంపెనీ లాభాలు, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, షేర్ వాల్యుయేషన్‌ను బేరీజు వేసుకుని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.