
ప్రభుత్వ రంగ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 9,124 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి మంగళవారం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 11న ప్రారంభం కాగా, అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా 2026 డిసెంబర్ 31 నాటికి ఉత్తీర్ణత పత్రం సమర్పించే షరతుతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఈ నోటిఫికేషన్లో భాగంగా హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) పరిధిలో 260 పోస్టులను కేటాయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. తొలుత ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష (సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 3 తేదీల్లో), అనంతరం మెయిన్స్ పరీక్ష (నవంబర్లో) నిర్వహిస్తారు. తుది దశలో స్థానిక భాషా