
ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిన యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) ఎర్ర సముద్ర తీరంలోని కీలక భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ మార్గంలో చమురు రవాణాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో మక్కా ఒప్పందంలో భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్‌.. సౌదీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ నుంచి సాంకేతిక సాయాన్ని సౌదీ ( Saudi Arabia ) కోరగా.. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ మధ్యవర్తిత్వం వహించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాలిబన్ల అదుపులో కేరళం వ్లాగర్‌.. ఆపై విడుదల ఇజ్రాయెల్‌ను ( Israel ) ఇప్పటివరకు స్వతంత్ర దేశంగా సౌదీ గుర్తించడం లేదు. దీంతో నేరుగా దౌత్య సంబంధాలు లేవనే చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇరాన్‌ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో (Red Sea) అలజడి సృష్టించారు. బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధిని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌదీ నౌకలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. హూతీల ముప్పు నేపథ్యంలో అప్రమత్తమైన సౌదీ.. ఈజిప్టు, గల్ఫ్‌ దేశాల సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రధాని మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అమెరికా సైన్యం సాయంతో ఇజ్రాయెల్‌తో పరోక్షంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ‘మక్కా త్రైపాక్షిక రక్షణ ఒప్పందం’లో పాకిస్థాన్‌, తుర్కియే, సౌదీ అరేబియాలు భాగస్వామిగా ఉన్నాయి. సౌదీతో పాకిస్థాన్‌కు ప్రత్యేకంగా స్వీయ రక్షణ ఒప్పందం కూడా ఉంది. అయినప్పటికీ యెమెన్‌లో హూతీలతో పోరాడేందుకు పాకిస్థాన్ నిరాకరించడంతో సౌదీ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటోందని సమాచారం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.