
ఆగస్టు నెలలో శని నక్షత్ర మార్పు జోతిష్యశాస్త్రంలో చాలా ప్రాముఖ్యతను తీసుకురానుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన రేవతి నక్షత్రంలోకి అడుగుపెడుతుంది. రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. దీని కారణంగా... ఈ నక్షత్ర మార్పు.. కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు తీసుకురానుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు తీసుకురానుంది. ఆ రాశులు ఇవే.. శని ప్రభావంతో సింహరాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఎన్నో రోజులుగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం వచ్చింది. కెరీర్, ఉద్యోగం: ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి రావడానికి లేదా ఊహించని మంచి ఉద్యోగావకాశాలు లభించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆర్థికం, వ్యాపారం: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొండిబాకీలు వసూలై చేతికి డబ్బు అందుతుంది. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి కొత్త ఒప్పందాలు కలసివస్తాయి. ఆత్మవిశ్వాసం: ఆత్మవిశ్వాసం రెట్టింపై కొత్త బాధ్యతలను ధైర్యంగా స్వీకరిస్తారు. మకర రాశి వారికి ఈ శని సంచారం అన్ని రంగాల్లోనూ సానుకూల మార్పులను తీసుకువస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ పురోగతి: నిబద్ధతతో మీరు చేసే పనికి పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆఫీసులో మీ స్థానం మరింత పటిష్టమవుతుంది. కుటుంబ సౌఖ్యం: మీ విజయాలు ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. ప్రేమ జీవితం: భాగస్వామితో ఉన్న పాత అపార్థాలన్నీ తొలగిపోతాయి. సంబంధాలలో నమ్మకం, ప్రేమ , సామరస్యం పెరుగుతాయి. మీన రాశి వారికి అదృష్టం తోడై విజయం మీ వెంటే నడుస్తుంది. మనసుకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం: సామాజికంగా మీ హోదా, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీ ప్రభావం విస్తరిస్తుంది. ఆర్థికం, వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. నూతన ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక పరిస్థితి