
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్ అభివృద్ధికి కీలకమైన ఏడు రంగాలను ‘శక్తి సప్తధార’గా అభివర్ణించారు. దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడు శక్తులను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. తయారీ రంగం, రైతులు, సాంకేతికత, గతిశక్తి, రక్షణశక్తి, హరిత ఇంధనం, సాఫ్ట్ పవర్‌ను భారత్ బలాలుగా పేర్కొన్నారు. ఈ రంగాల్లో వేగంగా ముందుకు సాగితే దేశ వృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పారు.1. తయారీ రంగం: భారత్ భవిష్యత్ వృద్ధికి తయారీ రంగమే కీలకమని మోదీ అన్నారు. విడిభాగాలతో పాటు పూర్తి ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయాలని సూచించారు. నాణ్యత, తక్కువ ఖర్చు, భారీ ఉత్పత్తితో ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ కీలకంగా మారాలని పిలుపునిచ్చారు.2. రైతులు: వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాలకు మరింత ఊతమివ్వాలని ప్రధాని చెప్పారు. భారత రైతులకు ప్రపంచ మార్కెట్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎగుమతులను పెంచాలని సూచించారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలను ప్రపంచ బ్రాండ్లుగా మార్చాలని అన్నారు.3. సాంకేతికత: కొత్త సాంకేతికతలు, డేటా సెంటర్లు, రోబోటిక్స్‌లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. యూపీఐతో భారత సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. దేశంలో తయారైన 6జీ సాంకేతికతను దేశవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.4. గతిశక్తి: దేశంలో రవాణా, అనుసంధాన వ్యవస్థలను మరింత వేగవంతం చేయాలని మోదీ అన్నారు. కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని