
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా బ్యాటర్లు కొన్నాళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేక తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వన్‌డౌన్‌లో దిగిన దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు. తొలి రోజు ఆటలో పడిక్కల్ (131*; 178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ బాదేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపిన ఈ లెప్ట్ హ్యాండర్.. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో క్రీజు వదిలేసి ముందుకు వచ్చి లాంగాన్ మీదుగా సిక్సర్ బాదాడు. అతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే టెస్టుల్లో తన శతకాన్నే డబుల్ సెంచరీగా మలిచేలా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పడిక్కల్‌పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆటగాడు టీమ్ఇండియాకు దేవుడిచ్చిన వరమని అభిప్రాయపడిన మంజ్రేకర్.. సాయి సుదర్శన్ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ పడిక్కల్‌నే మూడో స్థానంలో కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ను కోరాడు. ‘‘భారత జట్టులో దేవదత్ పడిక్కల్ రూపంలో ఒక కీలకమైన మార్పు కనిపించింది. జట్టు ఎంపిక ఎంత అద్భుతంగా ఉందంటే పడిక్కల్ క్రీజులోకి వచ్చి స్పిన్ బౌలింగ్‌ను ఎంతో సునాయాసంగా ఎదుర్కోవడం చూస్తుంటే అది స్పష్టమవుతోంది. స్పిన్‌ను డిఫెన్స్ చేయడంలోనూ ఫీల్డర్లు దూరంగా ఉన్నప్పుడు సులభంగా సింగిల్స్, డబుల్స్ తీస్తున్నాడు. అలాగే స్లో, టర్నింగ్ పిచ్‌లపై బ్యాక్‌ఫుట్ నుంచే దూకుడుగా షాట్లు ఆడుతున్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇలాంటి పిచ్‌పై స్పిన్‌ను ఎదుర్కోవడానికి ఇదే ఉత్తమ మార్గం. పడిక్కల్ క్రీజు వదిలి ముందుకు వచ్చి బౌలర్ తలమీదుగా షాట్లు కూడా కొట్టగల సమర్థుడు. కాబట్టి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై సాయి సుదర్శన్ జట్టులోకి తిరిగి వచ్చినా దేవదత్‌ను మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయించాలి. ఎందుకంటే స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతను అత్యంత సమర్థవంతమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. మూడో స్థానంలో ఇలాంటి ఆటగాడు దొరకడం టీమ్ఇండియాకు దేవుడిచ్చిన వరం అని