
ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్‌లోని తన విలాసవంతమైన ఇంటిని అభిమానులకు పరిచయం చేశారు. నటి అర్చనా పురన్ సింగ్, ఆమె భర్త పర్మీత్ సేథీ, వారి కుమారులతో కలిసి ఇటీవల సానియా ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా సానియా స్వయంగా తన ఇంటిలోని ప్రతి గదిని చూపిస్తూ, దాని వెనుక ఉన్న విశేషాలను పంచుకున్నారు. ఈ ఇంటి ఇంటీరియర్‌ను పూర్తిగా తన అభిరుచికి తగ్గట్టు సానియానే డిజైన్ చేసుకోవడం గమనార్హం.ఇంటి లోపలికి అడుగుపెట్టగానే రాజసం ఉట్టిపడేలా బంగారు, తెలుపు, నీలం రంగులతో కూడిన ఫార్మల్ లివింగ్ రూమ్ ఆకట్టుకుంటుంది. పురాతన వస్తువుల స్ఫూర్తితో రూపొందించిన ఈ గదిలో భారీ షాండ్లియర్ (జూమర్), గోల్డెన్ వాల్‌పేపర్, ఖరీదైన కార్పెట్లు, ఉర్దూలో రాసిన వాక్యాలతో ఉన్న ఫ్రేములు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, తమ కుటుంబం ఎక్కువగా సమయం గడిపేది ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఇన్ఫార్మల్ లివింగ్ రూంలోనే అని సానియా తెలిపారు. టీవీ చూస్తూ, క్రికెట్ మ్యాచ్‌లు ఆస్వాదిస్తూ ఇక్కడే రిలాక్స్ అవుతామని ఆమె చెప్పారు.ఈ ఇంటిలోని ఓ గెస్ట్ రూమ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. నలుపు, తెలుపు రంగుల థీమ్‌తో ఉన్న ఈ గదిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా వేసి బహుమతిగా ఇచ్చిన పెయింటింగ్స్ ఉన్నాయి. నమాజ్ చేస్తున్న వ్యక్తి చిత్రపటాలు ఈ గది గోడలకు అందాన్ని తెచ్చాయి. ఇక ఇంట్లో ఓ 'షో కిచెన్' కూడా ఉంది. అయితే ఇందులో కేవలం కాఫీ మాత్రమే పెడతారని, వంట చేయరని సానియా