
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకోవడం అటు తమిళ్ ఇండస్ట్రీలో .. ఇటు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకోవడం అటు తమిళ్ ఇండస్ట్రీలో .. ఇటు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరైన సంగీత.. ఈ కేసును ఇకపై కోర్టులో కొనసాగించబోనని వెల్లడించింది. దీంతో విజయ్ అభిమానుల్లో మరోసారి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. విజయ్ రాజకీయ ప్రచారం తలమునకలు అయ్యి ఉన్నప్పుడు సంగీత ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. విజయ్ తో విడాకులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా విజయ్.. త్రిషతో రిలేషన్ లో ఉన్నాడని, అతనితో ఇక కలిసి ఉండడం తనవలన కాదని తేల్చి చెప్పింది. దీంతో పాటు భారీ సంఖ్యలో భరణం కూడా కావాలని కోరింది. ఇక సడెన్ గా ఇప్పుడు ఆమె ప్లేట్ తిప్పేసింది. విడాకుల కేసును వెనక్కి తీసుకుంది. అంటే అప్పుడు సంగీత చేసిన ఆరోపణలన్నీ అబద్ధమా.. ? లేక వారిద్దరి రిలేషన్ ని ఆమె ఒప్పుకుందా.. ? అనే అనుమానాలు ఇండస్ట్రీలో తలెత్తుతున్నాయి. భర్త వేరొక నటితో సంబంధం పెట్టుకొని, ఇద్దరూ కలిసి అన్నీ ఫంక్షన్స్ కి వెళ్తూ.. ఆయన సక్సెస్ కి ఆమె కారణం అని ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా కూడా సంగీత ఇవన్నీ తట్టుకొని విజయ్ తో ఉంటుందా.. ? అంతటి తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత మళ్లీ పాత బంధాన్ని కొనసాగించడానికి ఆమె ఒప్పుకుందా.. ? కుటుంబ పెద్దలు వారిద్దరినీ కూర్చోబెట్టి ఏవిధంగా సంగీతని ఒప్పించారు.. ?