
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ , రాకాస వంటి సినిమాలతో గుర్తింపు పొందిన యువ హీరో… సంగీత్ శోభన్ (Sangeeth Sobhan). ఇప్పటికే మూడు చిత్రాలు పూర్తి చేసిన ఈ కుర్ర హీరో నాలుగు, ఐదో చిత్రాలు కూడా మొదలుపెట్టాడు. నిర్మాత ధీరజ్ మొగిలినేని, మరో నిర్మాత గిరిబాబు వల్లభనేని కలిసి సంగీత్ హీరోగా దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఒక చిత్రం తీస్తున్నారు. ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు హీరో సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మారుతి అనే పాత్రలో సంగీత్ శోభన్ నటిస్తున్నారు. ఇక ఐదో చిత్రంగా షైన్ క్రియేషన్స్ సంస్థకి సినిమా ఒప్పుకున్నాడు. ప్రణయ్ రావు దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది. మొత్తంగా అన్న సంతోష్ శోభన్ కన్నా తమ్ముడు సంగీత్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు
.