© 2026 nimisham.in

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ఆస్పత్రి సేవలను ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ సిటీ: సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ఆస్పత్రి సేవలను ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలోని 22.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.1070 కోట్లతో ఆస్పత్రిని నిర్మించారు. మే నెల నుంచి ఇక్కడ ఓపీ ట్రయల్ రన్‌ను నిర్వహిస్తున్నారు. రోజూ 200 నుంచి 250 మంది వరకు రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. గతేడాది డిసెంబర్ 9న, మార్చిలో ఉగాదికి ఆస్పత్రిని ప్రారంభించాలని భావించినా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. 1082 పడకలతో నిర్మిస్తున్న సనత్‌నగర్‌లోని టిమ్స్ మొదట 582 పడకలతో సేవలను ప్రారంభించబోతున్నారు. మిగితా 500 పడకలు అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. నాలుగు ప్రధానమైన వైద్య విభాగాల స్పెషాలిటీకి కేంద్రంగా నిలవనున్నది. కార్డియాక్ (గుండె సంబంధిత), నెఫ్రాలజీ-యూరాలజీ (మూత్ర పిండాలు, మూత్ర సంబంధిత), అవయవ మార్పిడి, ట్రామా విభాగాలకు వైద్య సేవలను అందించనున్నది. ఈ నాలుగు కీలక విభాగాలకు అనుసంధానంగా మరో 37 విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్ మాదిరిగానే టిమ్స్ కూడా స్వయం సహాయక ప్రతిపత్తి హోదా ఉండడంతో నిధులను సొంతంగా సేకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయిదారేళ్ల వరకు ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో సహాయం అందించనున్నది. ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్ రైళ్లు నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News