© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Samsung Galaxy A27 5G Leaks: ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సాంసంగ్ బడ్జెట్‌తో పాటు మిడ్రెంజ్ ప్రియుల కోసం ఒక సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇది సాంసంగ్ గెలాక్సీ A27 5G పేరుతో లాంచ్ కాబోతోంది. ఇటీవల చెక్ రిపబ్లిక్కు చెందిన samsung అధికారికి వెబ్సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అవడం దీనికి సంబంధించిన కీలకమైన ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ లీకవడం విశేషం. గత ఏడాది మార్చిలో విడుదలైన సాంసంగ్ గెలాక్సీ a26 5జికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ కొత్త మోడల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుతమైన డిస్ప్లే.. ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. సాంసంగ్ గెలాక్సీ A27 5జి స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.7 ఇంచుల ఫుల్ HD+ (1080 x 2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ (Super AMOLED) డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేతో పాటు వెనక భాగంలో ఫిల్ షీల్డ్ కెమెరా మాడ్యూయల్‌ని దీనికి అందించారు. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. పవర్ఫుల్ ప్రాసెసర్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (Snapdragon 6 Gen 3) ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది
. ఇది మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 128gb ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన పవర్ బటన్ తో పాటు కుడివైపున వాల్యూమ్ కంట్రోల్స్‌ను కలిగి ఉండబోతుంది.
కెమెరా, బ్యాటరీ సామర్థ్యం.. ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో కంపెనీ వెనక వైపు ట్రిపుల్ కెమెరా అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు అదనంగా చాలా ప్రత్యేకమైన 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.. ఇక సెల్ఫీ కోసం ఎందులో కంపెనీ ముందు భాగంలో అద్భుతమైన 12 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో కంపెనీ రోజంతా బ్యాకప్ ను ఇచ్చేలా..5,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు సమాచారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.