
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లకు గాయం కారణంగా బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు కల్పించారు. సర్ఫరాజ్ త్వరలోనే భారత జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకతో తొలి టెస్టు గాలె ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు జరగనుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి అప్డేటెడ్ భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాంశ్ జైన్, అకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.